E-Paper
Advertisement

Vastu defect: మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని ఇలా తెలుసుకోండి

Vastu defect: మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని ఇలా తెలుసుకోండి
Advertisement

Vastu defect: మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని అనుమానంగా ఉందా..? అయితే వాస్తు దోషం ఉందని తెలుసుకోవడం ఎలాగోనని ఆలోచిస్తున్నారు.. అలాంటి వాళ్ల కోసమే ఈ కథనం. కొన్ని సంఘటనల ఆధారంగా ఇంట్లో వాస్తు దోషాన్ని ఇట్టే తెలుసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు పండితులు. ఆ సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది.  తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం ఇల్లు మీద తర్వాత ఇంట్లో నివశించే వ్యక్తుల మీద పడుతుంది. ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. అలాంటి ఇంట్లో వాస్తు దోషం ఈ కింది విషయాల ద్వారా రూఢీ చేసుకోవచ్చు.

చికాకులు, టెన్షన్లు, అప్పులు:

Advertisement

ఏదైనా ఇంట్లో వాస్తు దోషం ఉందంటే ఆ ఇంట్లోకి వెళ్లిన వ్యక్తులకు అకారణ చికాకులూ, అనారోగ్యాలూ,  లేనిపోని టెన్షన్లూ,  యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, మానసికంగా కుంగిపోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం.. లేదా ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం లాంటి సంఘటనలు జరుగుతుంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనని పండితులు సూచిస్తున్నారు.

పిల్లలు పుట్టక పోవడం, వ్యాధులు రావడం:

కంటికి కనిపించని వాస్తుదోషం ఉన్న ఇంట్లో వ్యక్తులకు తరచుగా గొడవలు జరగడం. పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు  ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే  అటువంటి ఇంటికి  వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు. అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటం కూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు. దొంగతనాలు,  అగ్నిప్రమాదాలు,  అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం కూడా వాస్తుదోషాలలో భాగమే అంటున్నారు పండితులు.

ఆడబిడ్డల విషయంలో:

Advertisement

ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తు దోషాల కిందకే వస్తాయట. అలాగే  కొన్ని ఇండ్లు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి ఉండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కూడా ఇబ్బందులు ఉంటాయట.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుందట. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ ఉండదని చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ మూడు రాశులకు ఎలినాటి శని – తీవ్రమైన కష్టాలకు ఆ రెమెడీ ఒక్కటే పరిష్కారమట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×