Holi 2026: హోలీ అంటేనే రంగుల హంగామా. పాత గొడవలు, మనస్పర్థలు అన్నీ మర్చిపోయి.. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేసే సందర్భం. అయితే, ఈ సెలబ్రేషన్స్‌లో రంగులతో పాటు మనం కూడా కాస్త స్టైలిష్‌గా కనిపిస్తే ఇంకా బాగుంటుంది కదూ. మరి ఆ రోజున ఏ డ్రెస్ వేసుకోవాలి? ఎలాంటి కలర్ ఆప్షన్స్ ఎంచుకోవాలి? అని టెన్షన్ పడిపోతున్నారా? అందుకే ఈసారి హోలీ సెలబ్రేషన్స్ కోసం కొన్ని అదిరిపోయే అవుట్‌ఫిట్ ఐడియాలు మీకోసం..
హోలీ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తెల్లటి బట్టలు. ఎందుకంటే.. ఆ తెల్లటి రంగు మీద పడే రంగురంగుల చినుకులు ఒక పెయింటింగ్ లా కనిపిస్తాయి. మీరు ఈసారి ప్యూర్ కాటన్ వైట్ కుర్తా లేదా లక్నోవీ చికంకారీ కుర్తాను ట్రై చేయండి. ఇది చూడటానికి క్లాసీగా ఉండటమే కాకుండా, ఎండలో కూడా చాలా హాయిగా ఉంటుంది. అమ్మాయిలు అయితే వైట్ అనార్కలీ సూట్ లేదా వైట్ టీ షర్ట్ మీద కలర్ ఫుల్ దుపట్టా వేసుకుంటే ఆ లుక్కే వేరు. అబ్బాయిలు సింపుల్ వైట్ కుర్తాను డెనిమ్ జీన్స్‌తో జత చేస్తే పక్కా దేశీ స్టైల్ వచ్చేస్తుంది.
Also Read: శాఖాహారం తీసుకుంటే క్యాన్సర్ రాదా? 16 ఏళ్ల పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు!
హోలీ సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు మనం వేసుకునే బట్టలు చాలా కంఫర్ట్‌గా ఉండాలి. అందుకే టైట్ ఫిట్టింగ్ బట్టల కంటే కొంచెం లూజ్‌గా ఉండే పలాజోలు లేదా ఫ్యాబ్రిక్ ప్యాంట్స్‌ను ఎంచుకోండి. సింథటిక్ బట్టల కంటే.. కాటన్ లేదా లెనిన్ దుస్తులు బెస్ట్. ఎందుకంటే కలర్స్ పడి తడిసినప్పుడు ఇవి చర్మానికి అంటుకోవు. మీరు పాత బట్టలే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇండో వెస్ట్రన్ లుక్ కోసం షార్ట్ కుర్తీని ధోతీ ప్యాంట్స్‌తో మ్యాచ్ చేయొచ్చు.
కేవలం బట్టలు బాగుంటే సరిపోదు.. మనం వేసుకునే చిన్న చిన్న వస్తువులే మన లుక్‌ని మార్చస్తాయి. ముఖ్యంగా హోలీ అంటే రంగులతో పాటు ఎండ కూడా ఉంటుంది కాబట్టి.. కళ్ల రక్షణ కోసం ఒక మంచి సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఇది మీకు అదిరిపోయే స్టైల్‌ని ఇవ్వడమే కాకుండా, కళ్లలోకి రంగులు పడకుండా కాపాడుతుంది.
రంగుల వల్ల జుట్టు పాడవకుండా ఉండాలంటే తలకు కలర్ ఫుల్ బంధాని స్కార్ఫ్ లేదా ఒక చిన్న తలపాగా లాంటిది కట్టుకోండి. ఇది మిమ్మల్ని ఫొటోల్లో చాలా స్పెషల్‌గా, ఒక మోడల్‌లా చూపిస్తుంది. ఇక ఫుట్‌వేర్ విషయానికొస్తే.. మరీ ఖరీదైన షూస్ వేసి పాడు చేసుకోకుండా, మన సంప్రదాయం ఉట్టిపడేలా పాత జూతీలు లేదా కోల్హాపురీ చప్పల్స్ వేసుకోండి. ఇలా పక్కాగా ప్లాన్ చేస్తే, ఆ పండగ కళ మీలో క్లియర్‌గా కనిపిస్తుంది.
Also Read: ఎండలు మండిపోతున్నాయని చెరకు రసం తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!