E-Paper
Advertisement

Gho Pooja: అష్టకష్టాలను పోగొట్టి అష్టైశ్వర్యాలను  ప్రసాదించే గోపూజను ఎలా చేయాలో తెలుసా..?

Gho Pooja: అష్టకష్టాలను పోగొట్టి అష్టైశ్వర్యాలను  ప్రసాదించే గోపూజను ఎలా చేయాలో తెలుసా..?

Gho Pooja: హిందూ సాంప్రదాయంలో గోపూజ ఎంతో పవిత్రమైనది విశిష్టమైనది బావిస్తారు. గోవును సకల దేవతలకు నిలయంగా హిందువులు కొలుస్తుంటారు. అలాంటి ఆవుకు పూజలు చేస్తే ఎన్నో శుభాలు జరుగుతాయని నమ్ముతుంటారు. అయితే ఆవును ఆరాధించే ముందు దానికి ఎటువంటి ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో ఆవుకు ఉన్న సెంటిమెంట్‌ మరే దానికి లేదేమో..? హిందువులు పవిత్రంగా చూసుకునే ఆవు ఇంటికి వస్తే లక్ష్మీ దేవి వచ్చినంతగా సంబరపడతారు హిందువులు. అలాంటి అవును పూజించడం అనేది అనాదిగా వస్తుంది. అయితే అవును పూజించడం ఒక ఎత్తయితే దానికి ఆహారంగా ఏమేం ఇవ్వాలో కూడా శాస్త్రాలు చెప్పాయి అంటున్నారు పండితులు. ఆవుకు ఇచ్చే ఆహారమే మనుషుల తలరాతలు మారతాయని నమ్ముతుంటారు. అయితే ఏ ఆహారం ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నానబెట్టిన శనగలు: ఆవుకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందట. స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌. దైవ చింత‌న కూడా పెరుగుతుందట.

దోసకాయలు: మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ల‌కు దోస‌కాయ‌ల‌ను పెట్టాలట. దీంతో శ‌త్రు నివార‌ణ జ‌రుగుతుందట.

బెండకాయలు: గోమాత‌ల‌కు బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుందట. ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుందట.

నానబెట్టిన కందులు: ఆవుకు నానబెట్టిన కందులు పెట్టడం వల్లన ఎన్ని అప్ఉలు ఉన్నా తీరిపోతాయట. రుణ విముక్తులు అవుతారట.

నానబెట్టిన పచ్చి శనగలు: కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్తమానం కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వలు ప‌డుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుందట.

నానబెట్టిన పొట్టు పెసర పప్పు: మీ పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాలట.

నానబెట్టిన చాయ పెసరపప్పు: ఆవుకు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుందట.

గోధుమ పిండి, బెల్లం కలిపి పెడితే: ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ వారు గోమాత‌కు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలట.

మినప పిండి, బెల్లం కలిపి పెడితే: ధ‌నం బాగా సంపాదించాల‌నుకునే వారు గోమాత‌కు మిన‌ప‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలట. దీంతో ఆశించిన ధనం సంపాదిస్తారట.

దొండకాయలు: మాన‌సిక ప్ర‌శాంత‌త కావాల‌నుకునే వారు గోమాత‌కు దొండ‌కాయ‌లు పెట్టాలట.

అరటి పండ్లు: గోమాత‌కు అర‌టి పండ్లు తినిపిస్తే ఉన్న‌త ప‌ద‌వి పొందుతారట.

వంకాయ: సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాత‌కు వంకాయ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుందట.

క్యారెట్‌: వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాత‌కు క్యారెట్ల‌ను పెట్టాలట.

బంగాళా దుంప: న‌ర ఘోష ఉన్న వారు గోమాత‌కు బంగాళా దుంప‌ల‌ను తినిపించాలట. మంచి ఫలితాలు వస్తాయట.

ఇంకా వివాహం కానీ వారు టమాటలు పెట్టాలట. అలాగే బీట్‌రూట్‌, పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారట. ఐశ్వర్య ప్రాప్తి చాలా త్వరగా కలుగుతుందట. ఇంకా గోమాత‌కు నాన‌బెట్టిన గోధుమ‌లు పెడితే కీర్తి, ప‌ట్టుద‌ల ల‌భిస్తాయట. నానబెట్టిన బొబ్బట్లు పెడితే ధనాభివృద్ది కలుగుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తెలియాడే స్థంభం, నీడ లేని గోపురం – ఆ ఆలయాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీయే

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×