E-Paper
Advertisement

Kinnera Mogulaiah: దర్శనం మొగులయ్యకు డాక్టరేట్.. ఘనంగా సన్మానించిన సీఐ!

Kinnera Mogulaiah: దర్శనం మొగులయ్యకు డాక్టరేట్.. ఘనంగా సన్మానించిన సీఐ!
Advertisement

Kinnera Mogulaiah: కిన్నెర మొగులయ్యను మరో గౌరవం వరించింది. నేడు అంతరించిపోతున్న అరుదైన జానపద కళ ‘12 మెట్ల కిన్నెర’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన అసాధారణ కళాకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య (Darshanam Mogulaiah) అందరికీ పరిచయమే. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాతో ఆయన ప్రపంచానికి తెలిశారు. ఆ సినిమాలో ఆయన పాటకు, కళకు మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు తర్వాత ఆయనను పద్మశ్రీ కూడా వరించింది. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని ఆయన అందుకున్నారు. ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ ఆయన కళను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తన గాత్రంతో, కిన్నెర మీటుతో తెలంగాణ సంస్కృతిని దశదిశలా చాటిన మొగులయ్యకు ఈ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Also Read- Vijay Rashmika wedding: విజయ రష్మిక పెళ్లి.. రంగంలోకి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ.. పకడ్బందీగా ప్లాన్..

పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ సన్మానం

Advertisement

ఈ శుభసందర్భంగా శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన మొగులయ్యను అక్కడి ఇన్‌స్పెక్టర్ టి. మహేశ్ (T Mahesh) ఆత్మీయంగా ఆహ్వానించారు. ఒక గొప్ప కళాకారుడు తనను కలవడానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఐ, మొగులయ్యను శాలువాతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డాక్టరేట్ పట్టాతో ఉన్న మొగులయ్యను చూసి, తెలంగాణ మట్టి మనిషి సాధించిన ఈ విజయం మనందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

Also Read- Kalki part 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్..హైదరాబాద్ చేరుకున్న అశ్వత్థామ!

కళాకారుడి కృషికి ప్రశంసలు

Advertisement

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మహేశ్ మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో జానపద కళలు మరుగున పడిపోతున్న వేళ, తన అద్భుత ప్రదర్శనల ద్వారా కిన్నెర గానానికి పునర్వైభవం తెచ్చిన మొగులయ్య కృషి అసమానమైనదని ప్రశంసించారు. ఆయన సాధించిన ఈ గౌరవం వ్యక్తిగతమే కాకుండా, రాష్ట్రానికి, అలాగే దేశానికి కూడా గొప్ప కీర్తిని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేసే కళాకారులను గౌరవించుకోవడం సమాజ బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దర్శనం మొగులయ్య నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం, అవుసలికుంట గ్రామంలో జన్మించారు. 2021లో ‘భీమ్లా నాయక్’‌ సినిమాలో ‘ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అనే పాట ద్వారా సినీరంగంలోకి వచ్చిన మొగులయ్య, ఆ పాటతో తిరుగులేని గుర్తింపును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎంతో సపోర్ట్‌గా నిలబడి, ఆయన కళకు మంచి గుర్తింపును ఇచ్చింది.

Also Read- Prabhas: పక్కరాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రభాస్.. ఫుడ్ అంటే అంత ఇష్టం ఏంటయ్యా బాబు!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×