E-Paper
Advertisement

Mystery Temple: తెలియాడే స్థంభం, నీడ లేని గోపురం – ఆ ఆలయాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీయే

Mystery Temple: తెలియాడే స్థంభం, నీడ లేని గోపురం – ఆ ఆలయాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీయే
Advertisement

Mystery Temple: గాలిలో తెలియాడే స్థంభాలు, ఎంత ఎండలోనైనా నీడ కనిపించని ఆలయ గోపురం.. నీటిపై తేలియాడు రాళ్లు, అద్బుతమైన సప్త స్వరాలను పలికే ఆలయ స్థంభాలు.. ఎంత గాలి వీచినా ఆరిపోని దీపం, గాలిలో తేలుతున్నట్టు కనిపించే దేవుడి విగ్రహం, చెమటలు పట్టే అమ్మవారి విగ్రహం.. ఒక్కటి కాదు రెండు పదుల సంఖ్యలో ఉన్న  ఆలయాల మిస్టరీ ఇప్పటికీ హిస్టరీగానే మిగిలిపోయింది. ఏ శాస్త్రవేత్త కూడా ఆ మిస్టరీని చేధించలేకపోయాడు. ఏ సైంటిస్టుకు కూడా ఆ మిస్టరీ అంతు చిక్కలేదు. ఎన్నో అద్బుతాలకు నెలవైన మన దేశంలోని కొన్ని మిస్టరీ ఆలయాల గురించి అక్కడి వింతలు  విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని, వింతైన రహస్యాలు దాగి ఉన్న ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నిధులు, కోణార్క్ సూర్య దేవాలయం, స్తంభాలు లేని లేపాక్షి ఆలయం, శ్రీకాళహస్తిలోని కదలని దీపం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వంటివి అత్యంత ప్రసిద్ధ మిస్టరీ ఆలయాలుగా గుర్తింపు పొందాయి.

రామేశ్వరం:

Advertisement

ఇక్కడ సముద్రం మీద తేలియాడుతున్న రాళ్లు దర్శనం ఇస్తాయి. ఇవి త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ కోసం లంకకు వెళ్లడానికి కట్టిన వారథిలో కనిపిస్తాయి. యుగాలు గడిచినప్పటికీ ఇంకా ఆ రాళ్లతో కట్టిన వంతెన కనిపిస్తుండటం అద్బుతమనే చెప్పాలి. ఈ మిస్టరీని చేధించేందుకు అధునిక సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. రామసేతు వంతనలో ఉపయోగించిన రాళ్లు గురించి శాస్త్రవేత్తలే అద్బుతమైన కథనాలు వెలువరించారు.

తంజావూరు:   

తంజావూరులో లోని బృహదీశ్వరాలయం గోపురం నీడ  ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయం మీద భారీ గోపురం ఉంటుంది. ఇది ఎయ్యి టన్నుల ఏకశిలతో నిర్మించినట్టు పురాతత్వ వేత్తలు చెప్తుంటారు. విచిత్రం ఏంటంటే ఏ కాలంలోనైనా ఈ గోపురం నీడ కనిపించదు. ఇది నిర్మాణ అద్బుతమని శాస్త్రవేత్తలు చెప్తూనే..దీని వెనకున్న రహస్యాన్ని మాత్రం ఇప్పటికీ చేధించలేకపోయారు.

లేపాక్షి:

Advertisement

ఆంద్రప్రదేశ్‌లోని లేపాక్షి దగ్గర ఉన్న వీరభద్ర ఆలయంలో ఉన్న మిస్టరీ ఇప్పటకీ హిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయంలో వేలాడే స్థంభాలు ఉంటాయి. ఇవి కింద నేలను తాకకుండా పైన కట్టడం బరువును మోస్తుంటాయి. వీటి కింద నుంచి ఒక వస్త్రాన్ని తీయవచ్చట. ఇది అనాటి ఇంజనీరింగ్‌ వైభవానికి ప్రతీతకగా చెప్తుంటారు. వీటి వెనకున్న మిస్టరీని మాత్రం శాస్త్రవేత్తలు చేధించలేకపోయారు.

కాంచీపురం:

తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఆలయాల్లో అద్బుతమైన రహస్యం దాగి ఉంది. అక్కడి అలయాలలోని కొన్ని స్థంభాలను తాకినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు వస్తుంటాయట. ఆ ధ్వనులు స్వప్త స్వరాలను పోలి ఉండటం నేటికి అద్బుతంగా చెప్తుంటారు. ప్రాచీన భారతీయుల శబ్ద సాంకేతికతకు ఇది ఒక ఉదాహరణగా చెప్తుంటారు.

పద్మనాభస్వామి ఆలయం: కేరళలోని ఈ ఆలయంలో ఏడు గదుల్లో, ముఖ్యంగా ‘గది B’లో అపారమైన నిధులు ఉన్నాయని అంటారు, కానీ ఆ గదిని తెరిస్తే అపశకునం జరుగుతుందని నమ్ముతారు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం: ఆధ్రప్రదేశ్ లోని ఈ ఆలయ గర్భగుడిలో ఎటువంటి గాలి ప్రసరణ లేకపోయినా, శివలింగం ముందు ఉండే దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది.

కోణార్క్ సూర్య దేవాలయం: ఒడిశాలోని ఈ ఆలయం లో సూర్యరశ్మి పడగానే ప్రధాన విగ్రహం గాలిలో తేలుతున్నట్లు కనిపించేలా రూపొందించబడింది. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

పూరి జగన్నాథ్ ఆలయం: ఒడిశాలోని ఈ ఆలయ గోపురం ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అలాగే, ఆలయ శిఖరంపై నుండి విమానాలు వెళ్ళవు, నీడ కూడా భూమిపై పడదు.

కామాఖ్య దేవి ఆలయం: అస్సాం లోని ఇక్కడి ఆలయంలో అమ్మవారు ప్రతి ఏటా ఋతుస్రావం (Menstruation) పొందుతారని, ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుందని నమ్ముతారు.

దియోరియా కాళికా మాత ఆలయం: మధ్యప్రదేశ్ లోని ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఏసీ లేకపోయినా, ఆ పరిసరాల్లోని ఉష్ణోగ్రతను బట్టి అమ్మవారికి చెమటలు పడతాయని, అది మిస్టరీగా భావిస్తారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ సూర్య గ్రహణం తర్వాత ఆ నాలుగు రాశులకు అదృష్టం పట్టబోతుందట – ఏ రాశులో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×