Numerology: మీ సెల్ నెంబర్‌లో కొన్ని నెంబర్స్ ఉండటం వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయట. మరీ ముఖ్యంగా మీ నెంబర్‌లోని 9వ స్థానంలో ఆ రెండు సంఖ్యలు ఉంటే మీకు ఎప్పటికీ దరిద్ర చుట్టుకునే ఉంటుందట. ఇంతకీ ఆ రెండు నెంబర్స్ ఏంటి..? ఇంకా సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది లాంటి ఆసక్తికరమై విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మొబైల్ నెంబర్‌లోని ప్రతి అంకెకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందట. సాధారణంగా 10 అంకెల మొబైల్ నెంబర్‌లో, 9వ స్థానం (చివరి నుంచి రెండవది) మీ సామాజిక గౌరవం, వృత్తిపరమైన సంబంధాలు మరియు మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందని కొందరు సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే 9వ స్థానంలో ఉండే రెండు అంకెల వల్ల మాత్రం మీ పరిస్థితి తారుమారవుతుందని ఆ అంకెలు మీ మొబైల్ నెంబర్‌లో ఉంటే వెంటనే మార్చుకోమని సూచిస్తున్నారు.
9వ స్థానంలో 2 సంఖ్య ఉండటం వల్ల కలిగే నష్టాలు: సంఖ్యాశాస్త్రంలో ‘2’ చంద్రుడికి (Moon) ప్రతీక. ఇది మనస్సు, సున్నితత్వం మరియు సృజనాత్మకతను సూచిస్తుంది. ఇది మీ మానసిక స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌లో 9వ స్థానంలో ఉంటే.. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఊగిసలాడే అవకాశం ఉంటుందట. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అలాగే ఇతరులతో కటువుగా మాట్లాడే పరిస్థితులు వస్తాయట. ఇంకా స్నేహపూర్వకమైన సంబంధాలు విచ్చిన్నం అవుతాయట. అయితే కళలు, కౌన్సెలింగ్, లేదా సేవారంగాల్లో ఉండేవారికి ఈ నెంబర్ అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మానసిక ఆందోళన లేదా ఒత్తిడి కలగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
9వ స్థానంలో 8వ సంఖ్య ఉండటం వల్ల కలిగే నష్టాలు: సంఖ్యాశాస్త్రంలో ‘8’ శని గ్రహానికి (Saturn) ప్రతీక. ఇది క్రమశిక్షణ, కష్టం మరియు న్యాయాన్ని సూచిస్తుందట. ఈ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌లో 9వ స్థానంలో ఉంటే.. మీరు జీవితంలో ఏది సాధించాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుందట. ఏదీ అంత సులభంగా మీకు దక్కదట.. అయితే ఏదైనా దక్కితే మాత్రం అది అలాగే స్థిరంగా ఉండిపోతుందట. ఇక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. వృత్తిలో ఎదుగుదల నెమ్మదిగా ఉంటుందట. ఎంత కష్టపడినా ఒక్కోసారి ఫలితం అనేది శూన్యంగా కనిపిస్తుందట. అయితే ఒక్కసారి ఫలితం వస్తే అది ఎప్పటికీ పటిష్టంగా ఉంటుందట. 9వ స్థానంలో 8వ సంఖ్య ఉండటం వల్ల జీవితంలో అప్పుడప్పుడు ఒంటరితనం లేదా పనుల్లో జాప్యం (Delays) ఎదురయ్యే అవకాశం ఉంటుందట. పట్టుదలతో పని చేస్తేనే విజయం వరిస్తుందట.
మొబైల్ న్యూమరాలజీలో కేవలం ఒక అంకెను బట్టి ఫలితాలను నిర్ణయించడం కంటే, నెంబర్‌లోని అంకెల మొత్తం (Total Sum) మీ పుట్టిన తేదీ (Life Path Number) తో ఆ నెంబర్ కు ఉన్న సమన్వయాన్ని చూడటం చాలా ముఖ్యమట. ఉదాహరణకు మీ మొబైల్ నెంబర్ లోని అన్ని అంకెలను కలిపితే వచ్చే ‘సింగిల్ డిజిట్’ (ఉదాహరణకు: మొత్తం 46 వస్తే, 4+6 = 10, మళ్ళీ 1+0 = 1) మీ పుట్టిన తేదీకి మిత్ర సంఖ్య అయితే అది శుభ ఫలితాలను ఇస్తుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.