E-Paper
Advertisement

Burnt lamp wicks: ఇంట్లో పూజ చేసిన తర్వాత కాలిపోయిన దీపపు వత్తి,  వాడిపోయిన పూల విషయంలో ఆ తప్పు అసలు చేయకండి

Burnt lamp wicks: ఇంట్లో పూజ చేసిన తర్వాత కాలిపోయిన దీపపు వత్తి,  వాడిపోయిన పూల విషయంలో ఆ తప్పు అసలు చేయకండి
Advertisement

Burnt lamp wicks: ఇంట్లో దేవుడి ముందు పూజ చేసిన తర్వాత దీపపు వత్తి కాలిపోతుంది. అలాగే దేవుడి ముందు ఉంచిన పూలు వాడిపోతాయి. అయితే చాలా మంది అలా కాలిపోయిన వత్తిని, వాడిపోయిన పూలను తీసి పారేస్తుంటారు. లేదా డస్ట్‌ బిన్‌లో వేస్తుంటారు. అయితే వేయడం చాలా పెద్ద తప్పు అని పండితులు హెచ్చరిస్తున్నారు. కాలిపోయిన వత్తులు, వాడిపోయిన పూలు అలా పారివేయడం వల్ల మీరు చేసిన పూజలకు ఫలితమే లేకుండా పోతుందట. మరి వాటిని ఏం చేయాలి. అంటే అలాంటి వాటికి శాస్త్రంలో మంచి పరిహారాలు ఉన్నాయని సూచిస్తున్నారు పండితులు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది పూజలో ఉపయోగించిన నిర్మాల్యాన్ని (పూలు, వత్తులు) గౌరవపూర్వకంగా మరియు పర్యావరణానికి హితంగా విసర్జించడం మన సంప్రదాయం. అంతే కానీ ఇంట్లో చెత్త చెదారంతో కలిసి వాటిని డస్టబిన్‌లో వేయడం పెద్ద తప్పిదంగా పండితులు సూచిస్తున్నారు. అయితే శాస్త్రం ప్రకారం వాడిపోయిన పూలు, కాలిపోయిన వత్తి విషయంలో పాటించాల్సిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మొక్కలకు ఎరువుగా:  పూజ చేసిన తర్వాత వాడిపోయిన పువ్వులను ఒక చోట సేకరించి, మీ ఇంట్లోని మొక్కల మొదట్లో వేయాలట. ఇవి ఎండిపోయిన తర్వాత  సహజ సిద్ధమైన ఎరువుగా మారుతాయట.

భూమిలో నిమజ్జనం చేయడం: పూజ చేసిన తర్వాత వాడిపోయిన పూలను మీకు వీలైతే తోటలో లేదా ఏదైనా చెట్టు కింద చిన్న గుంత తీసి అందులో పూలను వేసి మట్టితో కప్పేయాలట. దీనిని “భూ నిమజ్జనం” అంటారట.

Advertisement

ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం:  పవిత్రమైన నదులు అందుబాటులో ఉంటే అందులో నిమజ్జనం చేయాలట. అయితే, ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతర కలుషిత పదార్థాలు నీటిలో వేయకుండా జాగ్రత్త పడాలని పండితులు సూచిస్తున్నారు.

కాలిపోయిన వత్తులను కూడా ఒక పద్దతి ప్రకారం తీసి వేయాలట. ఆ పద్దతులేంటో ఇప్పుడు చూద్దాం.

మట్టిలో వేయడం: దేవుడి పూజలో  పూర్తిగా కాలిపోయిన వత్తుల అవశేషాలను కూడా మొక్కల మొదట్లో లేదా మట్టిలో కలిపేయవచ్చట. పూజకు ఉపయోగించిన వత్తులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదట. వాటిని ఒక డబ్బాలో సేకరించి, పైన చెప్పిన విధంగా భూమిలో కలపడం శ్రేయస్కరం.

ఇతర పూజా సాగ్రి (ప్రసాదం, కుంకుమ, విభూతి):  పూజలో ఉపయోగించిన అక్షింతలను తల మీద వేసుకోవచ్చు లేదా పక్షులకు ఆహారంగా వేయవచ్చు. ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ స్వీకరించాలి. అయితే దేవుడికి అర్పించిన పూలను లేదా వత్తులను సాధారణ వ్యర్థాలతో కలిపి డస్ట్‌బిన్‌లో వేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే గోడ మూలల్లో లేదా పెద్ద వృక్షాల మొదట్లో వీటిని ఉంచడం గౌరవప్రదంగా ఉంటుందట. అలాగే మీ ఇంట్లో ఒక చిన్న కుండీని కేవలం ఈ నిర్మాల్యం కోసం కేటాయిస్తే, అది కాలక్రమేణా మంచి కంపోస్ట్‌గా మారి మీ మొక్కలకు ఉపయోగపడుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×