E-Paper
Advertisement

Jio IPL plans 2026: జియో ఐపీఎల్ ధమాకా.. ఫ్రీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో.. కళ్లుచెదిరే రీఛార్జ్ ప్లాన్స్!

Jio IPL plans 2026: జియో ఐపీఎల్ ధమాకా.. ఫ్రీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో..  కళ్లుచెదిరే రీఛార్జ్ ప్లాన్స్!
Advertisement

Jio IPL plans: దేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగ త్వరలో ప్రారంభం కాబోతోంది. మార్చి 28వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక ఐపీఎల్ – 2026 సీజన్ మెుదలవుతుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తన క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకంగా కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రకటించింది. వీటిలో రెండు యాడ్ ఆన్ ప్యాక్స్ కాగా.. మరొకటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఫ్రీ హాట్ స్టార్.. 90 రోజులు

ఈ ప్లాన్ డేటా యాడ్ ఆన్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు 15 GB డేటాతో పాటు 90 రోజుల కాలపరిమితి ఉచిత హాట్ స్టార్ మెుబైల్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. అదనపు డేటా, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రెండూ అవసరమయ్యే కస్టమర్లకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.

ఫ్రీ హాట్ స్టార్.. 30 రోజులు..

Advertisement

ఇది కూడా డేటా యాడ్ ఆన్ ప్యాక్. 30 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటాను అందిస్తుంది. అలాగే మెుబైల్ తో టీవీలోనూ ఫ్రీగా చూసేందుకు వీలుగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభించనుంది. అయితే పైదానితో పాటు ఇది కూడా డేటా ప్లాన్. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ తో పాటు ఏ ఇతర అదనపు ప్రయోజనాలు లభించవు.

రూ.949 రీఛార్జ్ ప్లాన్..

ఐపీఎల్ లవర్స్ కోసం జియో.. ఈ ప్రత్యేకమైన ప్యాక్ ను తీసుకొచ్చింది. రూ. 949 తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. ఫ్రీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను మెుబైల్ తో పాటు టీవీలోనూ ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Also Read: World’s Fastest Train: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!

రూ.899 ప్లాన్..

పైన పేర్కొన్న రీఛార్జ్ ను ప్లాన్ ను.. ఈ ప్యాక్ ను బేస్ చేసుకొని జియో తీసుకొచ్చింది. సాధారణంగా రూ.899 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఇది 90 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ కు కేవలం రూ. 49 జోడించి.. రూ.949కి రీఛార్జ్ చేయడం ద్వారా 84 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

Also Read: Air Cooler Cleaning Tips: మీ కూలర్ కూలింగ్ ఇవ్వట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. ఇక అంతా కూల్ కూల్!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×