E-Paper
Advertisement

Lucky Mole: అక్కడ పుట్టుమచ్చ ఉంటే కోట్లు సంపాదిస్తారట

Lucky Mole: అక్కడ పుట్టుమచ్చ ఉంటే కోట్లు సంపాదిస్తారట
Advertisement

Lucky Mole: సాముద్రిక శాస్త్రం (Body Mole Astrology) ప్రకారం శరీరంలోని కొన్ని భాగాలపై పుట్టమచ్చలు ఉండటం అదృష్టానికి, సంపదకు మరియు విజయానికి సూచికగా పరిగణించబడతాయని సాముద్రక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.  ముఖ్యంగా పురుషులకు శరీరానికి కుడివైపు, స్త్రీలకు ఎడమవైపు ఉండే మచ్చలు ఎక్కువ శుభప్రదమని చెప్తున్నారు. అయితే ఎవరికైనా సరే జీవితంలో అదృష్టాన్ని తీసుకువచ్చే కొన్ని ముఖ్యమైన పుట్టమచ్చల స్థానాలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నుదురు (Forehead): ఎవరికైనా నుదురు మధ్యలో  పుట్టుమచ్చ ఉంటే వారు చాలా తెలివైన వారని, భవిష్యత్తులో పేరుప్రఖ్యాతులు గడిస్తారని అర్థం చేసుకోవాలట. అలగే నుదురుకు కుడివైపున మచ్చ ఉంటే సంపద పెరగడానికి, వ్యాపారంలో భారీ లాభాలు రావడానికి సూచనగా బావించాలట.

Advertisement

రెండు కన్ను బొమ్మలు (Eyebrows): ఎవరికైనా సరే  కనుబొమ్మల మధ్యలో లేదా కనుబొమ్మలపైన పుట్టుమచ్చ ఉంటే వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట. వీరికి అధికార యోగం ఎక్కువగా ఉంటుందట. వీరు చేసే పనిలో తిరుగులేని విజయం సాధిస్తారట.

అరచేయి (Palm): ఎవరికైతే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుందో వాళ్లు చాలా అదృష్టవంతులట. ఇంకా పిడికిలి బిగించినప్పుడు మచ్చ లోపలికి వస్తే, అది అత్యంత అదృష్టంగా పరిగణించబడుతుందట. దీని అర్థం సంపద మీ దగ్గరే స్థిరంగా ఉంటుందని. ముఖ్యంగా కుడి అరచేయిలో మచ్చ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తక్కువగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

డ్డం (Chin):  గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులట. వీరికి జీవితంలో విలాసాలకు కొదవ ఉండదట. వీరు స్వతహాగా ప్రయాణాలను ఇష్టపడతారట.. అలాగే సమాజంలో గౌరవం పొందుతారట.

రెండు చెవులపై (Ears): చెవిపై ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా అది శుభప్రదమేనట. వీరు చాలా తెలివైన వారు, అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట. ముఖ్యంగా చెవి లోపల మచ్చ ఉంటే అది దీర్ఘాయువుకు మరియు సంపదకు చిహ్నమని నిపుణులు సూచిస్తున్నారు.

వీపు మీద (Back): వీపు మీద మచ్చ ఉన్నవారు చాలా కష్టపడే తత్వం కలిగి ఉంటారట. వీరు సుదూర ప్రయాణాలు చేస్తారట.. స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదుగుతారట.

కుడి పాదం (Feet): కుడి పాదం అడుగున మచ్చ ఉంటే వారు విదేశీ యానాలు చేసే అవకాశం ఉంటుందట. వీరు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారట.

గమనించదగ్గ విషయాలు: పుట్టుమచ్చలు  లేత రంగులో (తేనె రంగు లేదా ఎరుపు) ఉంటే అది ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుందని, నల్లగా మరియు పెద్దగా ఉంటే ఫలితాలు సాధారణంగా ఉంటాయని శాస్త్రం చెబుతోందట. ముఖ్యంగా అరచేతిలో లేదా నుదుటిపై ఉండే మచ్చలు వ్యాపారంలో రాణించడానికి  మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ పెరగడానికి దోహదపడతాయనట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పూజగదిలోని రాగి చెంబు విషయంలో ఆ తప్పు అసలు చేయకండి

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×