E-Paper
Advertisement

నా తమ్ముడు చెప్పినప్పుడు నమ్మలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మమిత బైజు!

నా తమ్ముడు చెప్పినప్పుడు నమ్మలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మమిత బైజు!
Advertisement

Mamitha Baiju:మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు (Mamitha Baiju) ఈ మధ్యకాలంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా బిజీగా మారిన విషయం తెలిసిందే. 2017 లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ 2024 వరకు గుర్తింపు కోసం కష్టపడింది. అలా ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత 2025లో డ్యూడ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. అలాంటిది ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ అనుమతులు లభించకపోవడం వల్లే ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాలేదు. అయితే సడన్గా మొన్న సినిమా మొత్తం లీక్ అయ్యి.. కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం దిగ్భ్రాంతికి లోనయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ దళపతి(Vijay Thalapathy) చివరి సినిమాగా వచ్చిన ఈ ప్రాజెక్టు ఇలా లీక్ అవడంపై ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా మండిపడ్డారు. అయితే తాజాగా మమితా బైజు కూడా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.

నా తమ్ముడు చెప్పినప్పుడు వినలేదు – మమిత బైజు

జననాయగన్ సినిమా లీక్ అయిందనే వార్త మొదట నా తమ్ముడు నాతో చెప్పాడు. కానీ నేను నమ్మలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత అది నిజమని తెలిసాక.. ఆ సినిమా కోసం మేము పడ్డ కష్టం వృధా అయ్యిందని భావించి ఎంతో బాధపడ్డాను. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే నేను కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నా ఇంట్లో వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ దురదృష్ట ఘటన మమ్మల్ని మరింతగా ఇబ్బందులకు గురిచేసింది. ఒక సినిమాను రూపొందించడంలో ఉన్న కష్టాన్ని వారు గుర్తించరా..కార్మికుడి కష్టాన్ని దెబ్బతీస్తారా.. దయచేసి కార్మికుల కష్టాన్ని వృధా చేయకండి అంటూ మమితాబైజు కోరింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని, అలాంటిది తెరపై చూడకుండానే లీక్ అవడం వల్ల చాలా బాధ కలిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మమితా బైజు.

Advertisement

also read:కళ్ళముందే అమ్మను చితకబాదేవాడు.. నరకం అనుభవించాను – బిగ్ బాస్ బ్యూటీ!

మమితా బైజు సినిమాలు..

మమితా బైజు సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె సూర్య సరసన విశ్వనాథం అండ్ సన్స్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ధనుష్ తో కలిసి కారా అనే సినిమాలో నటిస్తోంది. పైగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో కూడా మరో రెండు మూడు చిత్రాలలో నటిస్తూ తన కెరీర్ను విజయవంతంగా ముందుకు కొనసాగిస్తోంది. ఇక మొత్తానికి అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులన్ని కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి అంటే కచ్చితంగా ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుంది అనడంలో సందేహం లేదు.

Related News

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

Big Stories

Advertisement
×