Wedding: పెళ్లి జరుగుతున్న రోజు వర్షం పడితే శుభమా… అశుభమా..? అనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఎండాకాలంలో జరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు ముహూర్తాలు ఉంటే వర్షాకాలం, చలికాలంలోనూ పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ముఖ్యంగా వేసవిలో పెళ్లి జరుగుతుంటే అప్పుడే వర్షం పడితే మంచిదేనా అనేది చాలా మందిలో మెదిలో అనుమానం. అలాంటి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పెళ్లి రోజున వర్షం పడటంపై రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా మన సంస్కృతిలో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల దీనిని శుభ సూచికంగానే భావిస్తారట. వర్షం పడటం అనేది మంచికి సంకేతంగానే బావిస్తారు. కాబట్టి పెళ్లి చేసుకుంటున్న రోజు వర్షం కురవడం కూడా మంచిదే అంటున్నారు పండితులు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రచారంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నాయంటున్నారు పండితులు. ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నూతన దంపతులకు సంతాన సాఫల్య భాగ్యం కలగడం (Fertility): వర్షం పడితే భూమి పులకించి, పంటలు బాగా పండుతాయి. అలాగే, పెళ్లి రోజున వర్షం కురిస్తే ఆ జంటకు త్వరగా సంతాన భాగ్యం కలుగుతుందని, వారి జీవితం సుఖసంతోషాలతో విరాజిల్లుతుందని నమ్ముతారట.
కొత్త జీవితం ప్రారంభం (Cleansing): వర్షం గాలిలోని ధూళిని, మాలిన్యాన్ని కడిగేసినట్లుగా… పెళ్లి రోజు పడిన వర్షం కూడా ఆ కొత్త దంపతుల జీవితంలో ఉన్న పాత కష్టాలన్నీ తొలిగిపోయేలా చేస్తుందట. వారికి ఒక స్వచ్ఛమైన, కొత్త జీవితం మొదలవుతుందని సంకేతంగా భావించాలట.
కొత్త దంపతుల మధ్య బలమైన బంధం (The “Wet Knot”) ఏర్పడటం: హిందూ సంప్రదాయంలో ముడి వేయడం (బ్రహ్మ ముడి) అనేది చాలా కీలకం. తడిచిన ముడిని విప్పడం చాలా కష్టమని, అందుకే వర్షంలో పెళ్లి జరిగితే ఆ బంధం విడదీయలేనంత బలంగా ఉంటుందని ఒక చమత్కారమైన నమ్మకం కూడా ఉందంటున్నారు పండితులు.
నూతన దంపతులకు ఆర్థికాభివృద్ధి: వర్షాన్ని లక్ష్మీదేవి కటాక్షంగా కూడా చూస్తారట. పెళ్లి సమయంలో వర్షం కురిస్తే ఆ ఇంటికి సిరిసంపదలు వస్తాయని.. ఆ పెళ్లి చేసుకున్న జంట జీవితంలో కూడా ఆర్థికపరమైన కష్టాలు అనేవి రావని.. వారికి ఎప్పుడూ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు లభిస్తాయని బావించాలట. అలాగే
శాస్త్రీయ కోణంలో చూస్తే: ఇక శాస్త్రీయంగా చూస్తే వర్షం అనేది ఒక ప్రకృతి ప్రక్రియ. అయితే ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా దీనిని మంచికే సంకేతంగా చెప్తారు. కాబట్టి పెళ్లి రోజున వర్షం పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అది ఒక ఆశీర్వాదంగా భావించవచ్చని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.