E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ ను తిట్టిన రాజేశ్వరి.. పల్లవి, రాజేశ్వరికి భానుమతి వార్నింగ్..అవని ఇంట్లో రచ్చ చేసిన రాజేశ్వరి..

Intinti Ramayanam Today Episode: భరత్ ను తిట్టిన రాజేశ్వరి.. పల్లవి, రాజేశ్వరికి భానుమతి వార్నింగ్..అవని ఇంట్లో రచ్చ చేసిన రాజేశ్వరి..
Advertisement

Intinti Ramayanam Today Episode April 9th: చక్రధర్ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంటే అవని మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నాన్న ఇక్కడే ఉండండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈయన ఉంటే నాకు ఇక్కడ నచ్చదు అని భరత్ ఎంత చెప్తున్నా సరే.. అవని మాత్రం అమ్మకి ఈ వయసులో తన భర్తతో ఉండాలన్న ఆలోచన ఉంటుంది కదా ఆమె సంతోషాన్ని మనం కోరుకోవాలి అని అవని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి వెల్లి పొమ్మన్నట్లుగా నాటకం ఆడి మళ్లీ ఉండమని చెప్తున్నావా మీ నాటకాలు అన్నీ నాకు తెలీదా అని పల్లవి అంటుంది.. పల్లవి మాటలకు అవని బాధ పడిపోతూ ఉంటుంది.. పల్లవి అన్నమాటల గురించి మీరేం పట్టించుకోకండి నాన్న అని చక్రధర్ ని లోపలికి తీసుకెళ్ళమని చెప్తుంది..

భరత్ పై రెచ్చిపోయిన రాజేశ్వరి..

భరత్ చక్రధర్ఇంట్లో ఉన్నాడని ఆవేశంగా బయటకి వెళుతూ ఉంటాడు.. అయితే తను ఆలోచిస్తూ వెళ్లడంతో అక్కడున్న ఒక కారుకు పోయి గుద్దుకుంటాడు. కింద పడగానే ఆ కారులో ఎవరున్నారో చూడకుండానే సారీ అండి నేను చూసుకోలేదు అని అంటాడు.. అందులోంచి బయటికి వచ్చిన రాజేశ్వరి మాత్రం ఏంట్రా పొద్దు పొద్దున్నే ఈ శని దరిద్రం నాకు తగులుకుంది అని అంటుంది. మీ అక్క మీ అమ్మ నువ్వు నా మొగుడిని నాకు కాకుండా చేశారు అంటూ పొంతన లేకుండా దారుణంగా తిట్టేస్తుంది.. మీరంతా కట్టగట్టి నా భర్తని నాకు కాకుండా చేశారు మీరు నాశనం అయిపోతారు అంటూ రాజేశ్వరి దారుణంగా మాట్లాడడంతో భరత్ కూడా రెచ్చిపోతాడు.. అయినా కూడా రాజేశ్వరి మాట వినకుండా అందరినీ తిడుతూ వస్తుంది. ఈ దరిద్రాలన్నీ నా ఎదురుగానే ఉన్నాయి పదా అని డ్రైవర్ని తిడుతుంది.. చక్రధర్ తన ఇంట్లో వాళ్ళు తనని ఇలా అంటున్నారు అని బాధ పడిపోతుంటారు అవని మీనాక్షి ఇద్దరు కలిసి అతనికి ఓదార్పుడమే కాకుండా భోజనం తినిపిస్తాడు..

ఆస్తి వచ్చిందని పల్లవి హ్యాపీ..

Advertisement

రాజేశ్వరి మౌనంగా ఉండడం చూసినా భానుమతి ఇది ఆస్తి వచ్చిందని సంతోషంగా ఉందో భర్త లేడని బాధ పడుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. రాజేశ్వరి కాఫీ ఇవ్వమంటావా అని అడుగుతున్న సరే భానుమతికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి డాడ్ ఎక్కడో లేడు ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళాడు అని అనగానే రాజేశ్వరి ఇంకాస్త రెచ్చిపోతుంది.. నేను అర్థం చేసుకున్నానే మీ డాడీ అక్కడే ఉంటాడని.. అయితే ఇప్పుడు ఎలా పోతే మనకెందుకు ఆస్తి మొత్తం మనకే రాసి ఇచ్చి వెళ్ళాడు కదా ఎక్కడుంటే మనకేంటి అని పల్లవి అనగానే భానుమతి షాక్ అవుతుంది.. ఆస్తికన్న ఎక్కువ ఇంపార్టెంట్ ఐదోతనం.. దాని గురించి ఆలోచించరా ఏం మాట్లాడుతున్నారు ఇద్దరూ అని క్లాస్ పీకుతుంది. మొగుడిని ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి కానీ పంతాలకు పోయి ఇలా చేసుకోవడం తప్పు అని భానుమతి అంటుంది.

అక్షయ్ కు అవని నిజం చెప్తుందా..? 

మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న భరత్ కి నేను చెప్తాను అని అవని తన ఇంటికి వెళ్తుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన అక్షయ్ తో నేను ఒక విషయం చెప్పాలండి మీకు అని ఎంతగాన్నా సరే.. అతను మాత్రం బాగా టైడ్ అయ్యాను అవని. స్నానం చేసి వస్తాను నువ్వు ఆ లోపం నాకు కాఫీ పెట్టవా అప్పుడు ఏంటో మాట్లాడుకుందామని అంటాడు. అవని కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళగానే రాజేశ్వరి పల్లవి ఇంటికి వస్తారు. నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళాడని తెలుసుకొని వీళ్ళిద్దరూ అడగడానికి వచ్చారేమో అని అవని అనుకుంటుంది..

అవనిపై రాజేశ్వరి సీరియస్.. 

Advertisement

అవని అని గట్టిగా రాజేశ్వరి అరుస్తూ ఇంట్లోకి రావడంతో అందరూ ఏమైందని పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. ఏమైంది పిన్ని ఎందుకు అరుస్తున్నారు అని అవని అడగ్గానే.. ఎవరే నీకు పిన్ని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది.. నువ్వు నీ అమ్మ కలిసి నా భర్త నాకు కాకుండా చేశారు ఇప్పుడు నీకు కళ్ళు చల్లారయ్యా అనేసి రాజేశ్వరి అవన్నీ అవమానించేలా మాట్లాడుతుంది. కానీ అవని మాత్రం ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు అని ఎంతగా చెప్తున్నా సరే తను మాత్రం అసలు వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది.. అవని వల్లే మా నాన్న మాకు దూరమయ్యాడు అని పల్లవి కూడా అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.

రాజేశ్వరి పై అక్షయ్ సీరియస్.. 

అత్తయ్య ఏంటి మా ఆవిడ మీద అరుస్తున్నారు. మావయ్య తన తప్పు తెలుసుకుని ఆ తప్పును ఇన్నాళ్ల తర్వాత బయటపెట్టిన తర్వాత ఆయనను క్షమించలేదు.. అయినా కూడా ఆయన మీ దగ్గర ఉన్నా సరే ఆస్తి రాయించుకొని ఆ తర్వాత ఆయన బయటికి పంపించేశారు. ఆ విషయం మాకు తెలియదని అనుకుంటున్నారా అని అక్షయ్ అంటాడు.. ఇన్ని ఏళ్ల తర్వాత తన మొదటి భార్య గురించి ఆయన బయట పెట్టాడు.. మీనాక్షి గాని అవనిగని తన తండ్రి చక్రధరని ఇన్ని రోజుల వరకు కూడా బయట పెట్టలేదు.. అలాంటి వాళ్ల మీద ఇలా మీ నోటికొచ్చినట్లు నిందలు వేస్తారని పార్వతి కూడా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. మీరందరికి నేనంటే అలుసైపోయాను అని రాజేశ్వరి బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రాజేశ్వరికి అవని నిజం చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘ గుండెనిండా గుడిగంటలు ‘ నీతు రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×