E-Paper
Advertisement

పనీర్ వంటకాలు చేసేప్పుడు ఈ తప్పులు చేయకండి.. ప్రొటీన్ పోషకాలు పోయినట్లే

పనీర్ వంటకాలు చేసేప్పుడు ఈ తప్పులు చేయకండి.. ప్రొటీన్ పోషకాలు పోయినట్లే
Advertisement

Paneer Cooking Mistakes| పనీర్ అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం. ముఖ్యంగా ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. శాఖాహారులు ప్రొటీన్ కోసం పనీర్ ఇష్టపడతారు. పనీర్ కూరలు, స్నాక్స్, సలాడ్లలో మంచి ఐటెమ్‌గా ఇష్టపడి తింటారు. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుంచి 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ వండే సమయంలో చాలా మంది చేసే తప్పుల వల్ల పనీర్‌లోని పోషక విలువ తగ్గిపోతుంది.

అధిక వేడి మీద పనీర్ వండడం

చాలా మంది పనీర్‌ వండే సమయంలో ఎక్కువ మంట మీద వండేస్తారు. ఇలా చేస్తే పనీర్‌లోని మెత్తదనం పోయి గట్టిపడుతుంది. లోపలి ప్రోటీన్ నిర్మాణం బిగుసుకుపోయి జీర్ణం కావడం కొంచెం కష్టం అవుతుంది. పన్నీర్ రబ్బర్ లాగా మారి మెత్తదనం కోల్పోతుంది. ఎప్పుడూ తక్కువ లేదా మీడియం వంట మీదనే వండండి.

పనీర్‌ డీప్ ఫ్రై చేయడం

Advertisement

చాలా వంటల్లో పన్నీర్‌ డీప్ ఫ్రై చేస్తారు. ఇది రుచిని పెంచుతుందని భావిస్తారు. కానీ ఇలా చేస్తే అనవసరంగా నూనె, కొవ్వు పెరుగుతాయి. ఇది వంటలో పోషక సమతుల్యతను తగ్గిస్తుంది. ఫ్రై చేసే సమయంలో అధిక వేడి ప్రోటీన్ క్వాలిటీనీ కూడా కొంచెం ప్రభావితం చేస్తుంది. ఫుల్ ఫ్రై చేసే బదులు తేలికగా వేయించడం లేదా గ్రిల్ చేయడం మంచిది.

పనీర్‌ను ఎక్కువ సేపు మరగించడం

కొందరు పన్నీర్‌ను గ్రేవీలో చాలా సేపు మరగిస్తారు. ఇలా చేస్తే రుచి బాగా పెరుగుతుందని, ఇందులో మసాలా ఇంకుతుందని అనుకుంటారు. కానీ ఎక్కువసేపు వండితే పనీర్ గట్టిపడి నమలడం కష్టం అవుతుంది. పోషకాలు కూడా క్రమంగా తగ్గుతాయి. పనీర్‌ వంటకం చివర్లోనే వేయండి. రెండు-మూడు నిమిషాలు మాత్రమే వండండి.

పనీర్‌ నీళ్లలో చాలా సేపు నానబెట్టడం

Advertisement

చాలా మంది పనీర్‌ను ఉప్పు నీళ్లలో నానబెట్టి ఉంచుతారు. కానీ చాలా సేపు నానబెడితే పోషకాలు నీళ్లలోకి వెళ్లిపోతాయి. ఇది ప్రోటీన్ విలువను కొంచెం తగ్గిస్తుంది. అవసరమైతేనే కాసేపు నానబెట్టండి.

పనీర్‌ను ఎక్కువసార్లు కడగడం

కొందరు పన్నీర్‌ను ఎక్కువసార్లు కడుగుతారు. ఇలా చేస్తే నీటిలో కరిగి పోషకాలు పోతాయి. ఒకేసారి త్వరగా కడగడం చాలు.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లతో పనీర్ తినడం

పనీర్‌ను బ్రెడ్ లేదా సాదా అన్నంతో తినడం సరికాదు. ఇలాంటి ఆహారాలు ప్రోటీన్ ప్రయోజనాన్ని తగ్గిస్తాయి. బదులుగా కూరగాయలు లేదా హోల్ గ్రెయిన్స్‌తో కలిపి తినండి.

పనీర్‌ను సరిగ్గా స్టోర్ చేయకపోవడం

పన్నీర్‌లో ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల త్వరగా చెడిపోతుంది. పనీర్ ప్యాకెట్ ఫ్రిజ్‌లో లేదా నీళ్లలో ఉంచండి. రెండు-మూడు రోజుల్లో వాడేయండి.

పనీర్ ప్రోటీన్ విలువను కాపాడుకోవడానికి చిట్కాలు

తాజా పనీర్ మాత్రమే తీసుకోండి. తక్కువ వేడి మీద వండాలి. డీప్ ఫ్రై చేయకూడదు. గ్రిల్ లేదా తేలికగా వేయించండి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలతో కలిపి తినండి. సరిగ్గా నిల్వ చేయండి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×