E-Paper
Advertisement

Zodiac Signs: ఆ ఆరు నక్షత్రాల్లో పుట్టిన జాతకులు ఎప్పటికైనా ధనవంతులు అవుతారట

Zodiac Signs: ఆ ఆరు నక్షత్రాల్లో పుట్టిన జాతకులు ఎప్పటికైనా ధనవంతులు అవుతారట
Advertisement

Zodiac Signs:  ఆ ఆరు నక్షత్రాల్లో పుట్టిన జాతకులు ఎప్పటికైనా ధనవంతుల అవుతారట. జీవితంలో మొదటి దశలో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ రెండో దశలో మాత్రం వారి దశ తిరుగుతుందట. కోట్లకు అధిపతులను చేసే ఆ నక్షత్రాలేవో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి కేవలం నక్షత్రం మాత్రమే కాకుండా, జాతకంలోని గ్రహ స్థితులు, లగ్నం మరియు వారు చేసే కృషి కూడా చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి సహజంగానే సంపదను ఆకర్షించే గుణాలు వస్తాయట. వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఎక్కువగానే లభించే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రాల ప్రకారం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే  కొన్ని నక్షత్రాల ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రోహిణి నక్షత్రం: ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడట. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా, తెలివైన వారుగా ఉంటారట. వీరికి స్థిరాస్తులు (భూములు, ఇళ్లు) కలిసి వస్తాయట. వీరు అదృష్టవంతులుగా పరిగణించబడతారట. అలాగే వీళ్లు జీవితంలో విలాసవంతమైన భోగభాగ్యాలను అనుభవిస్తారట.

భరణి నక్షత్రం: భరణి నక్షత్రాధిపతి శుక్రుడు. శుక్రుడు సంపదకు కారకుడట. ఈ నక్షత్రం వారు చాలా పట్టుదల గలవారట. వీరు ఏ రంగంలో ఉన్నా కష్టపడి పైకి వస్తారట. వీరికి లగ్జరీ వస్తువుల మీద మక్కువ ఎక్కువగా ఉంటుందట. అలాగే వాటిని పొందే యోగం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందట.

Advertisement

పుష్యమి నక్షత్రం: దీనిని నక్షత్రాలలో రాజుగా పిలుస్తారట. ఈ నక్షత్ర అధిపతి శని, కానీ దీని దేవత మాత్రం బృహస్పతట. ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా క్రమశిక్షణతో ఉంటారట. వీరు వ్యాపారంలో లేదా ఉన్నత పదవుల్లో ఉండి భారీగా ధనాన్ని సంపాదిస్తారట. వీరికి సేవా గుణం కూడా ఎక్కువగానే ఉంటుందట.

రేవతి నక్షత్రం: రేవతి నక్షత్రాధిపతి బుధుడు. రేవతి నక్షత్రం వారు తెలివైన పెట్టుబడిదారులు. వీరు విదేశీ వ్యాపారాల ద్వారా లేదా మేధోపరమైన పనుల ద్వారా మంచి సంపదను ఆర్జిస్తారట. వీరికి అపారమైన దైవ భక్తి ఉంటుందట. అలాగే వీరికి అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందట.

ధనిష్ఠ నక్షత్రం: ఈ నక్షత్రాధిపతి కుజుడు. ధనిష్ఠ  అంటేనే  అత్యంత ధనవంతుడు అని అర్థమట. ఈ నక్షత్రం వారు సంగీతం, కళలు లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారట. వీరు సున్నా నుండి మొదలుపెట్టి కోట్లు గడించే స్థాయికి ఎదుగుతారట.

ఉత్తరాషాడ మరియు హస్త నక్షత్రాలు: ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టిన జాతకులు సమాజంలో గౌరవంతో పాటు ఉన్నత పదవులు అధిరోహించడంతో పాటు కోట్లు సంపాదిస్తారట. ఇక హస్త నక్షత్రం వారు కూడా ఏ పని మొదలు పెట్టినా అది లాభసాటిగా మారుతుదట. వీరి చేతుల్లో మంత్రం ఉన్నట్లుగా వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గొప్ప గొప్ప వ్యాపారవేత్తలంతా ఆ తేదీలోనే పుడతారట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×