E-Paper
Advertisement

DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
Advertisement

DK Shivakumar On IPL Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు దశల్లో షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక ( Karnataka ) ప్రభుత్వ పెద్దలు టికెట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. కర్ణాటకలో ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు ఐపిఎల్ విఐపి టికెట్లు ( IPL 2026 tickets ) ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Shivakumar) రియాక్ట్ అయ్యారు. ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు డికె శివకుమార్. దీంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

ప్రతి ఎమ్మెల్యేకు 4 విఐపి IPL టికెట్లు కావాల్సిందే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ నేతలు వింత వాదనలు తెరపైకి తీసుకువస్తున్నారు. విఐపి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేకు ఒక‌టి లేదా రెండు టికెట్లు కాదని..మొత్తం నాలుగు విఐపి ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కర్ణాటక స్పీకర్ UT ఖాదర్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యే కు రెండు టికెట్లు కాకుండా నాలుగు వీఐపీ ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్ణాటక సర్కార్ ను ఆదేశించారు.

స్పీకర్ కు షాక్ ఇచ్చిన డికే శివకుమార్

కర్ణాటక స్పీకర్ UT ఖాదర్ నాలుగు టికెట్లు ఇవ్వాల్సిందేనని ఇచ్చిన ఆదేశాలను డిప్యూటీ ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పొట్టి పారేశారు. స్పీకర్ UT ఖాదర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా నాలుగు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడించారు. గతంలో ప్రతి కర్ణాటక ఎమ్మెల్యేకు ఒకే ఒక్క టికెట్ ఇచ్చేవాళ్లు.. అయితే ఈ సారి రెండు టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీకే శివకుమార్ వివరించారు. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ను డీకే శివకుమార్ కోరారు. అంటే ఈసారి ఒక్కో కర్ణాటక ఎమ్మెల్యే కు రెండు ఐపిఎల్ విఐపి టికెట్లు దక్కనున్నాయి. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రేపు ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది.

Advertisement

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×