E-Paper
Advertisement

అలాంటి లక్షణాలు ఉన్న అమాయిలకే కుబేర యోగం ఉంటుందట

అలాంటి లక్షణాలు ఉన్న అమాయిలకే కుబేర యోగం ఉంటుందట
Advertisement

Kubera Yoga: అలాంటి అమ్మాయిలకే కుబేర యోగం ఉంటుందట. వారిని పెళ్లి చేసుకున్న పురుషుల జీవితం కుడేరుడితో సమానంగా కోట్లు గడించే స్థాయికి ఎదుగుతాడట. అయితే కుబేర యోగం ఎలాంటి అమ్మాయిలకు ఉంటుందో..? ఆ యోగం ఉన్న అమ్మాయిలను ఎలా గుర్తించాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్య మరియు సాముద్రిక శాస్త్రాల ప్రకారం, కుబేర యోగం లేదా లక్ష్మీ కటాక్షం కలిగిన మహిళలను వివాహం చేసుకోవడం వల్ల ఆ పురుషుడి జీవితం ఆర్థికంగా, సామాజికంగా ఊహించని మలుపులు తిరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. అటువంటి యోగం ఉన్న మహిళల లక్షణాలు మరియు వారి వల్ల కలిగే ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కుబేర యోగం కలిగిన మహిళల లక్షణాలు:

Advertisement

కుబేర యోగం కలిగిన మహిళల లక్షణాలు గుర్తించడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు అయితే వాటిలో ముఖ్యమైనది మహిళల పాదాల అడుగు భాగం మృదువుగా, గులాబీ రంగులో ఉండి, పద్మం లేదా చక్రం వంటి గుర్తులు ఉంటే అది మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారట. నడిచేటప్పుడు నేల పైన పాదం పూర్తిగా అనిగి ఉంటే అది స్థిరమైన సంపదకు సంకేతమట. ఇక వారి అరచేతిలో మత్స్య రేఖ (Fish symbol) లేదా త్రిశూలం గుర్తులు ఉన్నవారికి కుబేర యోగం ఉంటుందట. వీరి చేతిలో ధన రేఖ స్పష్టంగా, విరుపులు లేకుండా ఉంటుందట. అలాగే ప్రశాంతమైన ముఖం.. విశాలమైన నుదురు, మరియు నవ్వినప్పుడు ముఖంలో ఒక రకమైన కాంతి (తేజస్సు) కనిపించే మహిళలకు కుబేర యోగం ఉంటుందట. వారిని పెళ్లి చేసుకున్న పురుసులు ఎంతో  అదృష్టవంతులట. ఈ యోగం ఉన్న మహిళలకు ఎడమ అరచేతిలో లేదా ఎడమ పాదంపై పుట్టుమచ్చ ఉంటుందట. ఈ మచ్చ వల్ల ఆమెను పెళ్లి చేసుకున్న పురుషునికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుందట. కోట్ల రూపాయలు సంపాదిస్తాడట.

కుబేర యోగం ఉన్న మహిళలను వివాహం చేసుకుంటే కలిగే ఫలితాలు:

కుబేర యోగం ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న పురుషుడు.. పెళ్లికి ముందు సాధారణ స్థితిలో ఉన్నా.. ఇటువంటి యోగం ఉన్న స్త్రీ అడుగుపెట్టగానే ఆ వ్యక్తి వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యమైన వృద్ధిని సాధిస్తాడట. దీనినే భార్య అదృష్టం అని చాలా మంది అంటుంటారు కదా..? వీరి వల్ల ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుందట. కుబేర యోగం ఉన్న మహిళలు ధనాన్ని గౌరవిస్తారట అలాగే డబ్బును దానిని సరైన మార్గంలోనే ఖర్చు చేస్తారట. ఇంకా ఈ యోగం ఉన్న స్త్రీలు ఇచ్చే సలహాలు వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడతాయట. సాముద్రిక శాస్త్రం ప్రకారం వీరి ఉనికి ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు. వీరు కేవలం ధనాన్ని మాత్రమే కాదు.. కుటుంబానికి గౌరవ మర్యాదలను, సంస్కారాన్ని కూడా తీసుకువస్తారట. వీరికి కలిగే సంతానం కూడా తెలివైన వారుగా, ఉన్నత స్థానాల్లో స్థిరపడే వారుగా పుడతారట.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కోటీశ్వరులు అయ్యే ముందు ఆలాంటి కలలే వస్తాయట – ఇంకా స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×