E-Paper
Advertisement

కోటీశ్వరులు అయ్యే ముందు ఆలాంటి కలలే వస్తాయట – ఇంకా స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది

కోటీశ్వరులు అయ్యే ముందు ఆలాంటి కలలే వస్తాయట – ఇంకా స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది
Advertisement

Dreams: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు అలాంటి కలలే వస్తాయట. ఆ కలలు వచ్చాయంటే మీరు త్వరలోనే ధనవంతులు అయిపోతారట. అయితే ఆ కలలు ఏంటి..? అవి ఎప్పుడు వస్తే నిజం అవుతాయి లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం (Dream Analysis) ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పులు సంభవించే ముందు లేదా ఆర్థికంగా స్థిరపడే ముందు కొన్ని శుభప్రదమైన కలలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఆ కలలు వచ్చాయంటే వాళ్లు కచ్చితంగా ధనవంతులు అవుతారట. అయితే అవి ఎలాంటి కలలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

దేవాలయాలు లేదా దైవిక ప్రదేశాలు:  కలలో మీరు ఒక పెద్ద దేవాలయాన్ని చూడటం లేదా దైవ దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదమట. ఇలాంటి కల వస్తే అది మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి సంకేతంగా బావించాలట.

ఏనుగు: మీరు కనక  కలలో ఏనుగును చూశారంలే అది చాలా మంచి కల అని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఏనుగు ఐశ్వర్యానికి, జ్ఞానానికి, శక్తికి చిహ్నమట. ఇది మీ కెరీర్‌లో గొప్ప విజయం రాబోతుందనడానికి సూచికనట.

Advertisement

పాము: మీకు కలలో పాము కనిపిస్తే చాలా మంచిదట. ముఖ్యంగా కలలో పాము కుబుసం విడవటం లేదా పామును మీరు పూజిస్తున్నట్టు కల వస్తే.. మీకు తెలియకుండానే ఏదో ఒక పెద్ద ఆస్తి మీకు కలిసి వస్తుందనే సంకేతంగా భావించాలట.

పండ్లు, పూలు: ఎవరికైనా  కలలో తామర పువ్వును చూడటం లేదా చెట్ల నిండా పండ్లు కోస్తున్నట్లు కలలు కనడం ఐశ్వర్యానికి చిహ్నమట. ఇంకా వర్షంలో తడిసినట్టు.. నిండుగా ఉన్న సముద్రాన్ని, నదిని, చెరువును చూసినట్టు కల వస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుందట. అలాగే ఉదయిస్తున్న సూర్యుడిని మీరు కలలో కనక చూసినట్టయితే మీకు చీకటి రోజులు పోయి మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సంకేతంగా బావించాలట.

కలలు వచ్చాక ఎన్ని రోజులకు నిజం అవుతాయి:  స్వప్న శాస్త్రం ప్రకారం  తెల్లవారుజామున వచ్చిన కలలు 1 నుండి 3 నెలల లోపు నిజమయ్యే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. అయితే ఆయా వ్యక్తులు వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతుందని చెప్తున్నారు. ఇలాంటి కలలు వచ్చిన తర్వాత మీ ఆలోచనా విధానంలో మార్పు రావచ్చని. మీకు కొత్త వ్యాపార అవకాశాలు రావొచ్చని.. సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కష్టపడే తత్వం పెరగడం వంటి మార్పులు జరుగుతాయని .. ఆ మార్పుల ద్వారానే మీ జీవితం మారుతుందని సూచిస్తున్నారు.

అయితే, స్వప్న శాస్త్రంలో చెప్పినట్లుగా ఇలాంటి కలలు వచ్చిన ప్రతిసారీ మరుసటి రోజే కోటీశ్వరులు అవుతారని కాదు, అది మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకు లేదా శుభ పరిణామానికి సంకేతం అని అర్థం చేసుకోవాలట. ఒకవేళ మీకు ఇలాంటి కలలు తరచుగా వస్తుంటే అవి మీ మనస్సు చాలా ప్రశాంతంగా, ఆశాజనకంగా ఉందని సూచిస్తాయట. ఇది మీరు ఏదైనా పెద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతంగా బావించాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: జులై లో పుట్టారా..? మీకు 28 ఏండ్లు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×