E-Paper
Advertisement

ఆ తేదీలో పుట్టిన వాళ్లకు మల్టీఫుల్ టాలెంట్ ఉంటుందట

ఆ తేదీలో పుట్టిన వాళ్లకు మల్టీఫుల్ టాలెంట్ ఉంటుందట
Advertisement

Multiple Talent Persons: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీలో పుట్టిన వారికి మల్టిఫుల్‌ టాలెంట్‌ ఉంటుందట. ఒకేసారి ఎన్ని రకాలైన పనులు చేయడంలో వారు దిట్టలుగా ఉంటారట. వీరి జీవింతలో ఏ రంగంలో ఉన్నా నెంబర్‌వన్‌ స్థాయికి ఎదుగుతారట. ఇంతకీ ఆ తేదీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, ఏ నెలలోనైనా 10వ తేదీన జన్మించిన వారు సూర్యుని (Sun) ప్రభావం కలిగి ఉంటారట.  వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారట.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: పదవ తేదీన పుట్టిన వారు ఎప్పుడూ ఇతరుల కింద పని చేయడం కంటే, తామే ముందుండి నడిపించాలని కోరుకుంటారట. వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందట. ఎంతటి కష్టమైన పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారట.  కొత్త విషయాలను కనిపెట్టడం, విభిన్నంగా ఆలోచించడం వీరి నైజమని పండితులు సూచిస్తున్నారు. వీరు ఏ విషయంలోనైనా చాలా క్లారిటీతో ఉంటారట. ముక్కుసూటిగా మాట్లాడటం వీరి ప్రత్యేకత అంటున్నారు.

కెరీర్ మరియు వృత్తి పరమైన అంశాలు: 10వ తేదీన పుట్టిన వారు మేధస్సు మరియు అధికారంతో కూడిన రంగాల్లో బాగా రాణిస్తారట. ప్రభుత్వ రంగంలో కూడా వీరు అయ్యర్‌ పొజిషన్‌లో ఉంటారట. ఐఏఎస్ (IAS), ఐపిఎస్ (IPS) లేదా ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో ఉంటారట. ఇక వ్యాపారంలో చాలా రాణిస్తారట. సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించడం లేదా తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో వీరు చాలా టాలెంట్‌గా ఉంటారట. పదవ తేదీన పుట్టిన వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. అందువల్ల వీళ్లు రాజకీయాల్లో రాణించే అవకాశం మెండుగా ఉంటుందట. ఇంకా కంపెనీల్లో సి.ఇ.ఓ (CEO) లేదా మేనేజర్ స్థాయిల్లో వీరు అద్భుతంగా పని చేస్తారట.

Advertisement

ఆర్థిక స్థితి మరియు స్థిరత్వం: పదవ తేదీన పుట్టిన వారికి ధనానికి పెద్దగా లోటు ఉండదు. తమ తెలివితేటలతో సంపాదించడమే కాకుండా, గౌరవ మర్యాదలను కూడా పొందుతారట. సాధారణంగా 10వ తేదీన పుట్టిన వారికి 22 నుండి 28 ఏళ్ల మధ్యలోనే కెరీర్ కు పునాది పడుతుందట. అయితే పూర్తిస్థాయి ఆర్థిక స్థిరత్వం, గుర్తింపు మాత్రం 30 నుండి 35 ఏళ్ల వయసులో లభిస్తుందట. ముఖ్యంగా 28వ ఏట జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉంటుందట.

కలిసి వచ్చే అంశాలు (Lucky Factors): వీరికి పసుపు (Yellow), గోల్డెన్ (Golden), ఎరుపు (Red) మరియు తెలుపు (White) కలర్స్‌ అదృష్టాన్ని ఇస్తాయట. అలాగే 1, 10, 19, 28 సంఖ్యలు అదృష్టాన్ని ఇస్తే… 2, 3, 9 సంఖ్యలు  వీరికి సహకరిస్తాయట.

ముఖ్యమైన సూచనలు: ఒక్కోసారి వీరికి తెలియకుండానే అహంకారం తలకెక్కే ప్రమాదం ఉందట. దానిని తగ్గించుకుంటే ఇంకా ఎత్తుకు ఎదుగుతారట. వీళ్లు ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సోమవారం ఆ పనులు అసలు చేయకూడదట – ఏంటో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×