Bad Birth Date: ఆ తేదీలో పుట్టిన వారి జీవితం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదట. కానీ వారి జీవితంలో జరిగే మిరాకిల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారట. ఇంతకీ ఆ తేదీ ఏంటో జరగబోయే మిరాకిల్స్ ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం ఆ తేదీలో పుట్టిన వారి జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదట. కానీ ఏదో మిరాకిల్ మాత్రం వారికి జరిగి జీవితంలో అద్బుతం విజయాలు చేజిక్కించుకుంటారట. ఆ సంఖ్య ఏదో కాదు పద్నాలుగు. అవును ఏ నెలలోనైనా 14వ తేదీన జన్మించిన వారు బుధుడి ప్రభావం కలిగి ఉంటారట బుధుడు బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి కారకుడట.
14వ తేదీన పుట్టిన వారి వ్యక్తిత్వం, జీవితం: పద్నాలుగవ తేదీన పుట్టన వారు చాలా తెలివైనవారట.. అలాగే చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారట. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల నేర్పు వీరికి ఉంటుందట. వీరు ఒకే చోట లేదా ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండలేరట. జీవితంలో నిరంతరం మార్పును, కొత్తదనాన్ని కోరుకుంటారట. వీరి మాటతీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుందట. తమ మాట తీరుతో వీరు ఎదుటివారిని త్వరగా ఆకట్టుకుంటారట.
ఏ రంగంలో స్థిరపడతారు? (Career): బుధుడి ప్రభావం వల్ల వీరు మేధస్సుకు సంబంధించిన రంగాల్లో రాణిస్తారట.. సొంతంగా వ్యాపారం చేయడం వీరికి బాగా కలిసివస్తుందట. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్, ట్రేడింగ్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారట. ఇంకా జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ (PR), రైటింగ్ లేదా టీచింగ్ రంగాల్లో కూడా వీరు రాణించగలరట. సాఫ్ట్‌వేర్ రంగం, డేటా అనాలిసిస్ లేదా అకౌంట్స్ విభాగాల్లో వీరికి మంచి గుర్తింపు లభిస్తుందట. వీరికి ప్రయాణాల మీద మక్కువ ఉండటం వల్ల ఈ రంగం కూడా వీరికి లాభదాయకంగా ఉంటుందట.
ఏ విషయాలు అదృష్టాన్ని ఇస్తాయి?: వీరికి అదృష్ట సంఖ్యలు 5, 14, 23. అదృష్ట రంగులు పచ్చ (Green), తెలుపు (White). అదృష్టమైన రోజు బుధవారం మరియు శుక్రవారమని పండితులు సూచిస్తున్నారు.
జీవిత స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? (Stability Age): సాధారణంగా 14వ తేదీన పుట్టిన వారికి ప్రారంభ జీవితంలో కొంచెం అస్థిరత ఉండవచ్చట… కానీ 23 నుంచి 25 సంవత్సరాల వయస్సులో కెరీర్ పరంగా ఒక స్పష్టత వస్తుందట. ఇక 32, 33 సంవత్సరాల వయస్సులో జీవితంలో పూర్తిస్థాయి స్థిరత్వం (Stability) ఏర్పడుతుందట. ఈ సమయంలోనే వీరు ఆర్థికంగా కూడా బలపడతారట.
మీరు పాటించాల్సిన సూచనలు: వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారట. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉందట. ఏ పనైనా పని చేసే ముందు కాస్త ఆలోచించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలాగే మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందట. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఇక భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం వీరికి ఎక్కువ విజయాలను ఇస్తుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.