E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రి మాటతో మహా షాక్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహా.. కేశవ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : గాయత్రి మాటతో మహా షాక్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహా.. కేశవ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Podarillu Today Episode April 11th : తాయారు గాయత్రి కి ఎంతగా చెప్తున్న సరే నేను మాత్రం వెళ్తాను అని అంటుంది.. మహాలక్ష్మి గాయత్రి కి ఫోన్ చేయగానే తను మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తాగుబోతోడికి కోడలు నీకోసం ఫోన్ చేసిందా అంటే దీని ప్లానైనా ఇదంతాయని అని అనుకుంటుంది. గాయత్రి ఎంత చెప్తున్నా సరే వినకుండా తయారు మాత్రం తాను చెప్పిందే వినాలని మొండిగా ఉంటుంది.. గాయత్రీ ఎంతైనా సరే ఇవాళ వెళ్లి బావను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది.. మహాలక్ష్మి చక్రి కేశవ అందరూ కూడా గాయత్రిని బలవంతంగా అయినా తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు.. అందరూ కలిసి గాయత్రి ఇంటికి వెళ్తారు.. గాయత్రి బయటికి రాగానే వాళ్ళందరూ చూసి ఏమైంది అని అనుకుంటారు..

నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు.. 

మహాలక్ష్మి కేశవ చక్రి ఇంటికి వచ్చి గాయత్రి అని పిలుస్తారు.. తలుపు తీసి బయటకు వచ్చిన గాయత్రి వాళ్ళని చూసి మౌనంగా నిలబడుతుంది.. పెళ్లికి టైం అవుతుంటే నువ్వు ఇంకా రాలేదేంటి అని మహాలక్ష్మి గాయత్రీ ని బలవంతంగా బయటికి తీసుకుని వస్తుంది.. రా వెళ్దామని మహా అంటున్న సరే గాయత్రి ఆగిపోవడంతో ఏమైంది నీకు అని అడుగుతుంది.. ఎక్కడికి వచ్చేది నేను ఎక్కడికి రాను అని గాయత్రి అనగానే.. ఏంటి ఎక్కడికి రావాలి అని అడుగుతున్నావా ఏమైంది గాయత్రి నీకు అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఎక్కడికి రాను నాకు ఈ పెళ్లంటే ఇష్టం లేదు అని అంటుంది. నువ్వు ఇష్టం అని అనగానే కదా నేను ఈ పెళ్లి ఏర్పాట్లు చేయించింది.. వస్తానంటేనే కదా పెద్ది నువ్వు ఒప్పించేసి పెళ్లి కొడుకు దాకా తీసుకొని వచ్చింది అని మహాలక్ష్మి అరుస్తుంది..

కోపంతో రెచ్చిపోయిన మహా..

Advertisement

నాకు ఈ పెళ్లంటే ఇష్టం లేదు బావని చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని గాయత్రి అనగానే కోపంతో ఊగిపోయిన మహాలక్ష్మి గాయత్రి చంప పగలగొడుతుంది.. ఏంటి బొమ్మలాట అనుకున్నావా నువ్వు చెప్పడం వల్లే కదా నేను ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లాను ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని మహాలక్ష్మి గాయత్రి ని అడుగుతుంది.. నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. నీకోసం పెద్ది పెళ్లి కొడుకు గా రెడీ అయ్యి మండపంలో వెయిట్ చేస్తున్నాడు.. నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు ఎందుకిలా చేస్తున్నావు అని మహాలక్ష్మి ఎంతగా అడిగినా సరే గాయత్రి మాత్రం తనంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇంకొకసారి పెద్ది అంటూ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని గాయత్రీ కి వార్నింగ్ ఇస్తుంది.

మా వదిన కోసమే ఇదంతా చేసాము..

నువ్విలా భయపడుతూ ఉంటావు కాబట్టే నేను ఏది వద్దని అన్నాను.. నువ్వు చెప్పావని మా వదిన చెప్పడంతోనే మేము మీ ఇంటికి వరకు వచ్చాము.. ఇప్పటికైనా నువ్వు అను నేను తీసుకెళ్లి మా అన్నయ్యతో పెళ్లి చేస్తామని ఎంత చెప్తున్నా సరే గాయత్రి మాత్రం మౌనంగానే ఉంటుంది.. ఇంకొకసారి మా అన్నయ్య కోసం కానీ మా కోసం కానీ వచ్చావంటే నేనే చంపేస్తాను అని కేశవ వార్నింగ్ ఇస్తాడు.. ఇక మహాలక్ష్మి కూడా నువ్వు ఇంకొకసారి ఆ ఇంటికి వచ్చినా పెద్ది వైపు చూసిన తన జీవితంలోకి రావాలని అనుకున్న సరే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది..

గాయత్రి కోసం మాధవ్ ఎదురుచూపులు..

Advertisement

వాళ్లందరూ వెళ్లగానే లోపలికి వెళ్లి తలిపేసుకున్న గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నాకోసం వాళ్ళు వచ్చారు నేను వెళ్తాను అని గాయత్రి చెప్పగానే తాయారు నేను చచ్చిన తర్వాతే వెళ్ళు అని అనగానే భయపడిపోతుంది.. నేను చస్తాను అని బెదిరించడంతోనే తను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగిపోతుంది.. అటు మాధవ్ గాయత్రి ఇంకా రాలేదు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మాధవ్ మద్యం తాగి తన మనసులోని బాధని కక్కుతాడు.. అతని చూసిన అన్నదమ్ములు కూడా ఇలా మారిపోయాడు ఏంటి మా అన్నయ్య అని చాలా బాధపడిపోతూ ఉంటారు.. అన్నదమ్ములు తనకి ఎంతగా చెప్పిన సరే మాధవ్ మాత్రం కంట్రోల్ అవ్వలేక పోతాడు. మాధవ్ ని ఆ పరిస్థితిలో చూసిన మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు ధీరజ్ గోరుముద్దలు.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. మళ్ళీ పుట్టింటికి పయనం..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×