Future: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముహూర్తాలలో పుట్టిన వ్యక్తులకు అతీంద్రీయ శక్తులు ఉంటాయని నమ్ముతారు. వారికి ముందే భవిష్యత్తు తెలుస్తుందని అంటుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ తేదీలో పుట్టిన వారికి భవిష్యత్తు ముందే తెలుస్తుందట. వారి సిక్త్స్ సెన్స్ చాలా అద్బుతంగా పని చేస్తుందట. మరి ఆ తేదీ ఏంటి..? ఆ తేదీలో పుట్టిన వారి పూర్తి వివరాలేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం 7వ తేదీన (ఏ నెలలోనైనా) పుట్టిన వ్యక్తులు కేతువు (Ketu) గ్రహం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటారట. వీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక చింతన మరియు లోతైన ఆలోచనా ధోరణి కలిగిన వారై ఉంటారట. 7వ తేదీన పుట్టిన వారి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిత్వం మరియు లక్షణాలు: 7వ తేదీన పుట్టిన వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని తపిస్తుంటారట. పైకి కనిపించే విషయాల కంటే.. వాటి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారట. వీరు గుంపులో ఉండటం కంటే ఒంటరిగా ఉండి ఆలోచించడానికి ఇష్టపడతారట. అందుకే వీరు కొంత ‘రిజర్వ్డ్’గా కనిపిస్తారని పండితులు చెప్తున్నారు. అలాగే 7వ తేదీన పుట్టిన వారికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందట. జరగబోయే విషయాలను ముందుగానే పసిగట్టే శక్తి వీరికి చాలా అద్బుతంగా ఉంటుందట. అలాగే కొత్త ప్రదేశాలను సందర్శించడం.. ప్రకృతిని ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టమట.
7వ తేదీ వారికి అదృష్టం ఎప్పుడు వరిస్తుంది: 7వ తేదీన పుట్టిన వారికి జీవితం ప్రారంభ దశలో కొంత సంఘర్షణ ఉన్నప్పటికీ, కాలక్రమేణా అద్భుతమైన స్థిరత్వం వస్తుందట. సాధారణంగా 25 నుండి 28 ఏళ్ల మధ్య వీరి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మార్పు వస్తుందట.. ఇక వీరికి అసలైన అదృష్టం 34 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుందట. ముఖ్యంగా 38 నుండి 44 ఏళ్ల మధ్య కాలంలో వీరు ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారట.
ఏ రంగాల్లో స్థిరపడతారు?: 7వ తేదీన పుట్టిన వారికి మేధస్సు మరియు విశ్లేషణాత్మక శక్తి ఎక్కువగా ఉంటుందట. అందుకే వీరు శాస్త్రవేత్తలుగా, డేటా అనలిస్టులుగా లేదా ఇన్వెస్టిగేటర్లుగా బాగా రాణిస్తారట. అలాగే తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం గురువులుగా, యోగా మాస్టర్లుగా లేదా ఫిలాసఫర్లుగా బాగా రాణిస్తారట. అలాగే కవులు, రచయితలు లేదా జర్నలిస్టులుగా వీరి భావాలను అద్భుతంగా వ్యక్తపరుస్తారట. వీరు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా కోడింగ్ వంటి లోతైన ఆలోచన అవసరమయ్యే పనుల్లో రాణిస్తారట. ఇంకా సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ లేదా పెయింటింగ్ వంటి సృజనాత్మక రంగాల్లో కూడా వీరు నెంబర్‌వన్ పొజిషన్‌కు వెళ్లే అవకాశం ఉంటుందట.
కలిసి వచ్చే అంశాలు (Lucky Elements): 7వ తేదీన పుట్టిన వారికి లేత ఆకుపచ్చ (Light Green), తెలుపు (White), పసుపు (Yellow) కలర్స్ కలిసివస్తాయట. వీరు నలుపు రంగుకు దూరంగా ఉండటం మంచిదట. వీరికి 7, 16, 25 అదృష్ట సంఖ్యలట. ఏ పని మొదలు పెట్టినా ఆయా తేదీల్లో చేస్తే విజయవంతం అవుతాయట. అలాగే వీరికి సోమవారం, బుధవారం అదృష్ట వారాలట. ఇక 7వ తేదీన పుట్టిన వారు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందట. కాబట్టి క్రమం తప్పకుండా ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. వినాయకుడిని ఆరాధించడం వీరికి విశేషమైన ఫలితాలను ఇస్తుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.