E-Paper
Advertisement

మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే

మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే
Advertisement

Garuda Purana: ఒక మనిషి మరణించిన తర్వాత అతని కోసం అతని కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎక్కువగా ఏడవకూడదట. అలా ఏడవకూడదని గరుడపురాణం చెప్తుందట. అయితే ఎందుకు ఏడవకూడదు.. ఏడిస్తే ఏమవుతుంది అనే ఆసక్తికరమై విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణంలో మరణించిన వారి కోసం అతిగా దుఃఖించకూడదని స్పష్టంగా పేర్కొనబడిందట. గరుడ పురాణంలో దీనికి సంబంధించి కొన్ని కీలక కారణాలు ఇలా ఉన్నాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆత్మ ప్రయాణానికి ఆటంకం: అనేక పురాణాలు మరియు గరుడ పురాణం ప్రకారం, మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లాల్సి ఉంటుందట. జీవించి ఉన్న వారు అతిగా ఏడవడం, రోదించడం వల్ల ఆ ఆత్మకు ఈ భూమిపై ఉన్న బంధాలు (మాయ) గుర్తుకు వచ్చి, వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుందట. దీనివల్ల ఆ ఆత్మ ప్రశాంతంగా వెళ్లలేక, మధ్యలోనే చిక్కుకుపోతుందని గరుడపురాణంలో ఉందట.

ఆత్మకు అశాంతి: మరణించిన వారు భౌతికంగా మనకు కనిపించకపోయినా, వారి సూక్ష్మ శరీరం మన చుట్టూనే ఉండి మన భావాలను గమనిస్తుందట..  మనం పడే వేదన, దుఃఖం చూసి వారు కూడా బాధపడతారని, అది వారికి అశాంతిని కలిగిస్తుందని గరుడపురాణంలో ఉందట. మన ఏడుపు వారికి అశ్రువుల నది లాగా అడ్డు వస్తుందట.

Advertisement

జీవించి ఉన్న వారి ఆరోగ్యం: అతిగా ఏడవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందట. తీవ్రమైన దుఃఖం మనిషిని డిప్రెషన్‌లోకి నెట్టేస్తుందట. కంటి చూపు మందగించడం, గుండెపై ఒత్తిడి పెరగడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయట. నిత్యం ఏడవడం వల్ల జీవితంపై విరక్తి కలుగుతుందట.

ప్రకృతి ధర్మం: పుట్టిన ప్రతి ప్రాణి మరణించడం ప్రకృతి సహజం. వచ్చిన వారు వెళ్లక తప్పదు అనే వాస్తవాన్ని అంగీకరించడమే నిజమైన జ్ఞానమని పండితులు సూచిస్తున్నారు. మరణించిన వ్యక్తి పట్ల మనకు ఉన్న ప్రేమను ఏడుపు ద్వారా కాకుండా, వారి జ్ఞాపకాలను గౌరవించడం ద్వారా లేదా వారు ఇష్టపడే మంచి పనులు చేయడం ద్వారా చాటుకోవాలట.

కర్మకాండల ఉద్దేశ్యం: హిందూ సంప్రదాయంలో మరణానంతరం చేసే కర్మకాండల ముఖ్య ఉద్దేశ్యం ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకోవడమట. మనం ఏడుస్తూ ఉంటే ఆ కర్మలు చేసేటప్పుడు మనసు లగ్నం కాదు.. ఇది ఆత్మకు మేలు చేయదట. అందుకే ధైర్యంగా ఉండాలి  అని పెద్దలు పదే పదే చెప్పడంలోని అంతర్యం అదేనట.

ఇష్టమైన వారు దూరమైనప్పుడు బాధ కలగడం సహజం, అది మనిషి నైజం. అయితే ఆ దుఃఖం ఒక పరిధి దాటితే అది మనకు, వెళ్లిన ఆత్మకు ఇద్దరికీ మంచిది కాదని… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి మనం ఇచ్చే అసలైన నివాళి అని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: స్వప్నశాస్త్రం ప్రకారం కలలు నిజమవుతాయా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×