Numerology: ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు ఎప్పటికైనా చాలా గొప్ప రైటర్లు అవుతారట. వారి రాసే రచనలకు అభిమానులు కోకొల్లలుగా ఉంటారట. వారి రచనల కోసం రీడర్లు ఎగబడతారట. ఇంతకీ ఏ తేదీన పుట్టిన వారు రైటర్లు అవతారో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం గురు గ్రహానికి సంబంధించిన తేదీన పుట్టిన వారికి రచనల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. గురు గ్రహం జ్ఞానానికి, అభివృద్ధికి, సృజనాత్మకతకు కారకం. అందుకే, ఏ నెలలో అయినా సరే 3వ తేదీన పుట్టిన వారి జీవితం చాలా ఉత్సాహంగా, విద్యావంతులుగా కళాత్మకంగా ఉంటుందట. ఇంకీ వీరి జీవితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సృజనాత్మకత మరియు కళాత్మకత (Creativity & Art): మూడో నెంబర్‌లో పుట్టిన వ్యక్తులకు కళలు, సాహిత్యం, సంగీతం లేదా రచనలంటే అమితమైన ఆసక్తి ఉంటుందట. వీరు తమ భావాలను మాటల ద్వారా లేదా కళల ద్వారా చాలా ప్రభావవంతంగా వ్యక్తీకరించగలరట. అద్భుతమైన ఊహాశక్తి వీరి మూడో తేదీన పుట్టిన వ్యక్తులకు ఉంటుందట. వీరు గొప్ప రచయితలుగా రాణిస్తారట.
ఆశావాదం మరియు ఉత్సాహం (Optimism): మూడో తేదీన పుట్టిన వ్యక్తులు ఎప్పుడూ నవ్వుతూ, అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారట. సమస్యలు ఎదురైనప్పుడు కూడా కృంగిపోకుండా ఆశావాద దృక్పథంతో ఉంటారట. వీరి ఉత్సాహం ఇతరులను కూడా ఉత్తేజపరుస్తుందట.
కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి: మూడో నెంబర్ జాతకులకు టీచింగ్, కౌన్సెలింగ్, రైటింగ్, మార్కెటింగ్, లీగల్ రంగం, లేదా మీడియా రంగం బాగా సెట్ అవుతుందట. ప్రజలతో మాట్లాడే ఏ రంగమైనా వీరికి కలిసి వస్తుందట. వీరు ఆర్థికంగా త్వరగానే స్థిరపడతారట.
వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలు (Personality): మూడో తేదీన పుట్టిన వ్యక్తులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట. చదువు, జ్ఞానం అంటే వీళ్లకు చాలా గౌరవం ఉంటుందట. వీళ్లు కట్టుబాట్లకు, పరిమితులకు లోబడి ఉండటానికి ఇష్టపడరట. తమ సొంత నిర్ణయాలతో, స్వేచ్ఛగా పనిచేయాలని కోరుకుంటారట. వీరిలో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయట.
సవాళ్లు మరియు పరిష్కారాలు: మూడో తేదీన పుట్టిన వాళ్లు కొన్నిసార్లు తాము చెప్పిందే వేదమనే భావనలో ఉంటారట. అదే వీరిని ఇబ్బంల పాలు చేస్తుందట. అలాగే ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టి.. ఏదీ పూర్తి చేయకుండా వదిలేసే మనస్తత్వం వీరికి ఉంటుందట. కొన్ని సందర్భాల్లో అనవసరంగా మాట్లాడటం వల్ల ఇబ్బందుల పాలవుతారట.
విజయానికి చిట్కాలు: వీరు ఏదైనా పనిని తలపెట్టినప్పుడు దాన్ని పూర్తి చేసే వరకు వదలకూడదట. ఇది వీరిని కెరీర్‌లో గొప్ప స్థానాన్ని తీసుకెళ్తుందట. వీరికి చాలా టాలెంట్ ఉంటుందట.. దాన్ని సమయానుగుణంగా ఉపయోగిస్తే అద్భుతాలు క్రియేట్ చేయోచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇక 3వ తేదీన పుట్టిన వారు సృజనాత్మకతకు జ్ఞానానికి ప్రతీకలుగా ఉంటారట. అయితే వీరి తెలివితేటలను, కళాత్మకతను సరైన దిశలో వినియోగించుకుంటే వీరు విజయం సాధిస్తారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.