E-Paper
Advertisement

married men: పెళ్ళైన పురుషులు ఆ విషయాలు ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదట – అవేంటో తెలుసా

married men: పెళ్ళైన పురుషులు ఆ విషయాలు ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదట – అవేంటో తెలుసా
Advertisement

married men: పెళ్లైన మగవాళ్లు ఎప్పటికీ కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదట. ఆ విషయాలు బయటకు చెప్పడం వల్ల వారి జీవితంలో సమస్యలు వస్తాయట. అయితే పెళ్లైన పురుషులు బయటకు చెప్పకూడని ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్ళైన పురుషులు తమ వ్యక్తిగత విషయాల గురించి గోప్యత పాటించడం చాలా ముఖ్యమైన విషయమట. అలాగే సంప్రదాయం మరియు అనుభవజ్ఞుల మాట ప్రకారం కొన్ని విషయాలు బయటకు చెప్పడం వల్ల వారి జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..?

Advertisement

భార్య లోపాలు లేదా బలహీనతలు: ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. పురుషుడు తన భార్యకు సంబంధించిన వ్యక్తిగత బలహీనతలు లేదా ఆమె చేసే చిన్న చిన్న పొరపాట్లను స్నేహితుల దగ్గరో, బయటి వ్యక్తుల దగ్గరో చర్చించకూడదట. ఇది మీ భార్య గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మీ మధ్య దూరాన్ని పెంచుతుందట. భార్య గౌరవం తగ్గిందంటే అది మీ గౌరవం కూడా తగ్గినట్లేనట.

ఇంటి గుట్టు (కుటుంబ గొడవలు) బయటకు చెప్పరాదు: పాతకాలంలో ఒక సామెత ఉండేది గోడకు చెవులుంటాయి అని అది సామెత కాదు నిజ జీవితంలో జరిగే సంఘటనలకు తార్కాణం. మీరు నాలుగు గోడల మధ్యే కదా అని ఏదైనా సీక్రెట్‌ మాట్లాడుకుంటే అది ఎవరైనా విని బజారు పాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు బయట చెబితే, ఇతరులు వాటిని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉంటుందట. ఇంకా  భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ల గదిలోనే పరిష్కారించుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

ఆర్థిక స్థితిగతులు (ఆదాయం మరియు అప్పులు): మీరు ఎంత సంపాదిస్తున్నారు లేదా మీకు ఎంత అప్పు ఉంది అనే విషయాలు ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. సంపాదన ఎక్కువని తెలిస్తే అసూయ పడేవారు చాలా మంది ఉంటారు. అలాగే మీకు ఏదైనా అప్పు ఉందని తెలిస్తే చులకనగా చూసేవారు కూడా ఎక్కువే ఉంటారు. కాబట్టి మీ ఆర్థిక స్థితిగతులు ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోవద్దట.

అవమానాలు: మీకు బయట ఎక్కడైనా అవమానం జరిగితే, దాన్ని పదే పదే అందరికీ చెప్పి సానుభూతి పొందాలని చూడకండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి విషయాలను భార్యతో పంచుకోవచ్చు కానీ, బయట వ్యక్తులతో అసలు చెప్పుకోవద్దని సూచిస్తున్నారు.  

దాన ధర్మాలు: మనం చేసే సాయం ఎదుటివారికి తెలియనప్పుడే దానికి విలువ ఉంటుంది. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. నేను ఫలానా వారికి ఇంత సాయం చేశాను అని చెప్పుకోవడం వల్ల మీ ఇమేజ్ పెరగకపోగా, అహంకారిగా ముద్ర పడే ప్రమాదం ఉంటుందట.

ఫైనల్‌ గా ఏ బంధమైనా నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. బయటి వ్యక్తుల జోక్యం ఎంత తక్కువగా ఉంటే ఆ బంధం అంత బలంగా ఉంటుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో మొదటి మెట్టు ఎందుకు ప్రత్యేకమో తెలుసా?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×