E-Paper
Advertisement

Meena raashi: పంచగ్రహ కూటమి – మీనరాశి జాతకులకు రాజయోగమే

Meena raashi: పంచగ్రహ కూటమి – మీనరాశి జాతకులకు రాజయోగమే
Advertisement

Meena raashi: పంచగ్రహ కూటమి మీనరాశి జాతకులకు రాజయోగం తీసుకురానుందా..? దశాబ్దాల కష్టాలకు ఇక చెక్‌ పడనుందా..? ఎన్నడూ లేనంతగా మీన రాశి జాతకుల దిశ మారనుందా..? అంటే అవుననే చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక నుంచి ఒక ఎత్తు అన్నట్టుగా మీన రాశి జాతకుల భవిష్యత్తు ఉండబోతుంది అంటున్నారు. అసలు పంచగ్రహ కూటమి వల్ల మీన రాశి వారికి జరగబోయే మంచి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటంతో మీనరాశి జాతకులకు రాబోయే రెండు నెలలు అద్బుతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. వరుసగా పదేళ్లు నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన మీన రాశి జాతకులను ఇక అదృష్టం వరించనుందట. ఎన్నో ఏళ్ల కష్టాలకు ఇక పులిస్టాప్‌ పడనుందని పండితులు చెప్తున్నారు. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ లాభంలో రాహువు ఉండటం చేత మీన రాశి జాతకుల దశ తిరగనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే పంచగ్రహ కూటమి వల్ల మీన రాశి వారికి జరగబోయే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని అడ్డంకులున్నా లాభాలే:

Advertisement

పంచగ్రహ కూటమి ఏర్పాటు వల్ల ఈ నెలలో మీనరాశి జాతకులు అద్బుత రాజయోగం ఏర్పడనున్నది. దీర్ఘసంచార గ్రహాల ప్రతికూల ప్రభావం ఉన్నా.. ఏలినాటి శని ఉన్నా.. రాహుబలం లేకపోయినా..అర్ధాష్టమిలో గురుడు లేకపోయినా కూడా పంచగ్రహ కూటమి రూపంలో మీన రాశి వారికి అదృష్టం తలపు తట్టనున్నది. పంచగ్రహ కూటమి కానీ షష్ట గ్రహ కూటమి కానీ ఏర్పడినప్పుడు అవి వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి అని చాలా మంది అనుమానిస్తుంటారు.  ఈ సిచ్యుయేషన్‌లో మీన రాశికి ఎలా లాభం చేకూరనుంది అని పశ్నిస్తుటారు.

లాభ స్థానంలో కుజుడు:

అయితే కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. దీని వల్ల ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం. కొత్త ఇంటిని నిర్మాణం పూర్తి చేసుకోవడం. అధికంగా డబ్బు సంపాదించుకోవడం.. అలాగే సంతాన లాభాన్ని, కుటుంబ లాభాన్ని సూచిస్తుంది. సంతోషంతో కూడిన ఆర్థిక లాభం చేకూరుతుంది. దీన్ని అనుభవించే గ్రహస్థితి ఇప్పుడు మీన రాశి వారికి వచ్చిందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క:

Advertisement

ఇప్పటి వరకు మీన రాశి వారికి ఆనందం లేదు. సంతోషం లేదు. సుఖం లేదు. ఏమీ లేదు ఆఖరికి జుట్టు రాలిపోతుంది. ఇవన్నీ గ్రహస్థితి వల్ల జరిగింది. శనీశ్వరుడు నెత్తి మీద కూర్చుంటే అలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏర్పడబోయే షష్ట గ్రహ కూటమి మీన రాశి వారికి వీటన్నింటిని నుంచి బయటపడేందుకు అవకాశం ఇస్తుంది. మీన రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయి. ఇది చాలా అద్బుతమైన కాలం అని పండితులు చెప్తున్నారు.

ఏలినాటి శనికి రెమెడీ:

అయితే ఇప్పటికే ఏలినాటి శని నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరేం చేయాలంటే.. ప్రతినిత్యం దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. సుబ్రమణ్య అష్టకం చదవాలి. అలాగే చవితి తిథిని పాటించండి. గణపతిని ప్రార్థించండి. గరిక, బెల్లం, చెరుకు పానకం సమర్పించండి. ఇంకా చాలా మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: హిజ్రాల దీవెన ఎందుకు తీసుకుంటారు  – అసలు పురాణాలు ఎం చెప్తున్నాయి

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×