E-Paper
Advertisement

Transgenders: హిజ్రాల దీవెన ఎందుకు తీసుకుంటారు – అసలు పురాణాలు ఎం చెప్తున్నాయి

Transgenders: హిజ్రాల దీవెన ఎందుకు తీసుకుంటారు – అసలు పురాణాలు ఎం చెప్తున్నాయి
Advertisement

Transgenders: హిజ్రాల దీవెన ఎందుకు తీసుకోవాలి. గృహ ప్రవేశ సమయంలోనూ పెళ్లిళ్లు, పేరంటాలు ఒక్కటేమిని మనిషి తమ జీవితంలో జరిగే ప్రతి శుభకార్యంలో హిజ్రాల దీవెన ఉండాలని చాలా మంది హిదువులు కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే వారిని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానిస్తుంటారు కొందరు. అయితే హిజ్రాల దీవెన వెనక చాలా రకాలైన పురాణగాథలు ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ సాంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి హిజ్రాలను ఆహ్వానించడం అనవాయితీగా వస్తుంది. వారితోనే ఇల్లు, ఆఫీసు, వ్యాపార స్థలాలు లాంటి వాటిని ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా వారి నుంచి దీవెనలను తీసుకుంటున్నారు. మిగతా వారి కంటే హిజ్రాల దీవెన ఎంతో ఉత్తమమైనదని కొందరు భావిస్తుంటారు. పుట్టిన బిడ్డ నుంచి పెళ్లి అయినా కొత్త దంపతులు, కొత్త ఇల్లు వంటి శుభకార్యాలు నిర్వహించినప్పుడు వీరి దీవెన ఎంతో శుభప్రదం అని అనుకుంటారు. అయితే వీరి దీవెన ఇంత ఉత్తమమైనది కావడానికి కారణం ఏంటి? అందుకు గల పురాణ కథ ఏదైనా ఉందా?

హిజ్రాల దీవెన వెనక పురాణ గాథ:

Advertisement

సమాజంలో స్త్రీలు, పురుషులు అనే రెండు లింగ భేదాలు కాకుండా మరో రకమైన వారిని హిజ్రాలు అని పిలుస్తుంటారు. వీరి ప్రవర్తన సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే అనుకోకుండా వారి శరీరంలో జరిగిన మార్పుల తోనే వారు ప్రత్యేకంగా మారుతారు. సాధారణ వ్యక్తుల్లో మంచివారు, చెడ్డవారు ఉన్నట్లే.. హిజ్రాల్లో కూడా మంచివారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు మనస్ఫూర్తిగా దీవిస్తే వారు ఎంతో ఉన్నత స్థితికి చేరుతారని భావిస్తారు. అందుకే వారు ఎక్కడ కలిసినా వారితో దీవెనలను అందుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే హిజ్రాల దీవెన వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ఆధారంగానే హిజ్రాల దీవెన ఎంతో ఉత్తమమైనది అని భావిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే?

శ్రీరాముడి వరం:

రామాయణంలో రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం వెళ్లిన విషయం తెలిసిందే. రాముడు అడవికి వెళ్లేటప్పుడు అతనితో ఊరు ప్రజలు వెంట వెళ్తారు. వీరిలో హిజ్రాలు కూడా ఉంటారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత రాముడు వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని చెబుతాడు. వీరిలో కొంతమంది తిరిగి వెళ్తారు. కానీ హిజ్రాలు మాత్రం రాముడు తిరిగి వచ్చేవరకు అక్కడే కాలం గడుపుతారు. అలా రాముడు తిరిగి వచ్చేసరికి అక్కడే ఉన్న హిజ్రాల భక్తిని చూసి ఎంతో మెచ్చుకుంటాడు. దీంతో వారికి ఒక దీవెనలు ఇస్తాడు. మీరు ఎంతో ఉత్తమమైన భక్తితో కలిగి ఉన్నారు.. అందువల్ల మీ దీవెనలు ఎంతో శుభప్రదంగా ఉంటాయని వరం ఇచ్చాడని పురాణాల్లో చెప్పబడింది.

రాజ కుటుంబాల్లో ప్రత్యేక గదులు:

Advertisement

అలా హిజ్రాలు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే హిజ్రాల గురించి చరిత్ర పుటల్లో కూడా ఉంది. మొగల్ సామ్రాజ్యంలో హిజ్రాలు రక్షకులుగా ఉండేవారు. వీరికి కొన్ని ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసేవారు. రాజ కుటుంబానికి సంబంధించిన పిల్లలను బాగా చూసుకునే బాధ్యతను రాజులు వీరికి అప్పగించేవారు. అలాగే ప్రసవం తర్వాత తల్లులు, పిల్లలను రక్షించడం.. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వల్ల వీరికి గుర్తింపు వచ్చింది. అయితే హిజ్రాలు మంచి మనసుతో దీవిస్తే శుభం జరుగుతుంది.. కానీ వారు చెడు దృష్టితో చూస్తే తీవ్రమైన నష్టం జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

శివుడికి ప్రతిరూపాలు:

ఇంకా హిజ్రాలను అర్ద్రనారీశ్వరుడికి ప్రతిరూపంగా బావిస్తారు. అర్ధ్రనారీశ్వరుడే హిజ్రాల రూపంలో భూమి మీద తిరగాడుతుంటాడని చాలా మంది హిందువులు నమ్ముతుంటారు. అందుకే వారి నుంచి దీవెన తీసుకుంటే సాక్ష్యాత్తు ఆ పరమశివుడు దీవించినట్టే అని బావిస్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శ్రీశైలం నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలెర్ట్ – ఈ విషయాలు తెలియకుండా అస్సలు వెళ్ళకండి

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×