E-Paper
Advertisement

వెయ్యేళ్లుగా శివలింగంపై చెదరని ఛాయ.. ఆశ్చర్యపరుస్తున్న పానగల్లు ఆలయం మిస్టరీ!

వెయ్యేళ్లుగా శివలింగంపై చెదరని ఛాయ.. ఆశ్చర్యపరుస్తున్న పానగల్లు ఆలయం మిస్టరీ!
Advertisement

Chaya Someswara Temple Panagal: నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఆశ్చర్యకరమైన రహస్యంతో ఆకట్టుకుంటుంది. దాదాపు 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళతో పాటు గర్భగుడిలో కనిపించే విచిత్రమైన దృశ్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది.

శివలింగంపై రహస్య నీడ

ఈ ఆలయంలోని ఆసక్తికర విషయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగంపై ఎప్పుడూ నీడ కనిపించడం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి దిశ మారుతున్నప్పటికీ ఆ నీడ మాత్రం శివలింగంపై కదలకుండా కనిపిస్తుంది. ఆ ఎలా ఏర్పడుతోంది? ఎక్కడి నుంచి శివలింగంపై పడుతోంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ కారణంగానే ఆలయానికి  ఛాయా సోమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది.  ఛాయా అంటే నీడ. శివలింగంపై కనిపించే ఈ నీడ ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, చరిత్ర పరిశోధకులు, పర్యాటకులు ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి వస్తుంటారు.

అద్భుతంగా ఆకట్టుకునే ఆలయ నిర్మాణ శైలి

Advertisement

ఈ ఆలయం నిర్మాణ శైలి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. రాతితో నిర్మించిన ఈ దేవాలయంలో అద్భుతమైన స్తంభాలు, అందమైన శిల్పాలు, సున్నితమైన చెక్కుదల కనిపిస్తుంది. చాళుక్యుల కాలం నాటి శిల్పకళకు గొప్ప నిదర్శనంగా కొనసాగుతోంది. ఈ ఆలయంలోని ప్రతి భాగం అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

రహస్య నీడపై ఎన్నో అభిప్రాయాలు

శివలింగంపై కనిపించే నీడ గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని దైవ మహిమగా విశ్వసిస్తే, మరికొందరు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక వాస్తు, సూర్యకాంతి పడే కోణాలు, స్తంభాల అమరిక వల్ల ఈ దృశ్యం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు దీనిపై పూర్తి స్థాయిలో శాస్త్రీయ వివరణ అందుబాటులో లేదు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, సూర్యుడి కదలికతో వెలుతురు మారినా నీడ ఆకారం పెద్దగా మారకుండా కనిపిస్తుంది. అందుకే ఇది ఎన్నో సంవత్సరాలుగా  మిస్టరీగా మిగిలిపోయింది.

చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం

Advertisement

పానగల్లు ఇప్పటికీ చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి.  చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత, నిర్మాణ వైభవం అన్నీ ఒకేచోట చూడాలనుకునే వారికి ఇది మంచి పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. ఛాయా సోమేశ్వర ఆలయం.. నేటికీ తన రహస్యాలతో భక్తులను మాత్రమే కాదు, చరిత్రకారులను, వాస్తు నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం భారతీయ శిల్పకళ వైభవాన్ని చాటుతూ, ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకని ఒక అద్భుత కట్టడంగా కొనసాగుతోంది. అందుకే, ఈ ఆలయం తెలంగాణలో తప్పక సందర్శించాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Read Also: గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

Related News

భారత్ లో ఎడమ వైపు, అమెరికాలో కుడివైపు.. వాహనాలు నడిపే విధానంలో ఎందుకీ తేడా?

ఆకుపచ్చ నగరంగా మారిన కాంక్రీట్ జంగిల్‌.. ఇది కదా నిజమైన గ్రీన్ రివల్యూషన్ అంటే!

నల్లగొండ జిల్లాలో వజ్రాలు, బంగారు గనులు, వామ్మో.. అన్ని చోట్ల ఉన్నాయా?

విదేశాల్లో యుపిఐ హవా.. ఈ 10 దేశాల్లో భారతీయులు యుపిఐతో పేమెంట్స్ చేయవచ్చు

సిద్దిపేట పేరు వెనుక మూడు ఆసక్తికరమైన కథలు!

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సంచలనం.. శిలాశాసనం బయటపెట్టిన 500 ఏళ్ల రహస్యం!

భూకంపం వచ్చినా భయంలేదు.. మన బుల్లెట్ రైలుకు సూపర్ సేఫ్టీ షీల్డ్!

Big Stories

Advertisement
×