E-Paper
Advertisement

రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

రాగాలు పలికే రాళ్లు..  నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?
Advertisement

Nagara Banda Nalgonda: సంగీతానికి రాళ్లు కరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. నిజానికి రాళ్లు కరుగుతాయో? లేదో తెలియదు. కానీ, నల్లగొండలోని ఓ చోట మాత్రం రాళ్లు సంగీతం వినిపిస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నల్లగొండ జిల్లాలో ఉన్న నగారా బండ గుట్ట మీద.. రాళ్లను మరో రాయితో కొడితే, అద్భుతమైన సంగీత ధ్వనులు వినిపిస్తాయి. ఈ అరుదైన ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది తరలి వస్తుంటారు.

ఒక్కోరాయి నుంచి ఒక్కో శబ్దం..

నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని అకినేనిగూడెం, అంగడిపేట గ్రామాల మధ్య నగారా బండ ఉంటుంది. ఇది  సుమారు ఏడు ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. సాధారణంగా కనిపించే బండరాళ్లలాగే ఉన్నా, వాటిని తాకితే సంగీత స్వరాలను పలుకుతాయి. ఒక్కో రాయిని ఒక్కో చోట తట్టితే ఒక్కో రకమైన శబ్దం వినిస్తుంది. ఈ గుట్ట మధ్యలో పెద్ద గుండ్రటి రాయి ఉంటుంది. దానిని మరో రాయితో మెల్లగా కొడితే ఆలయంలో గంట మోగినట్లుగా మధురమైన శబ్దం వినిపిస్తుంది. మరో రాయిని తట్టితే ఇనుప గంటను కొట్టినట్లుగా గట్టి ధ్వని వినిపిస్తుంది. కొన్ని రాళ్లను నెమ్మదిగా రాపిడికి గురి చేస్తే, సరిగమల మాదిరిగా వినసొంపైన శబ్దాలు వస్తాయి. ప్రతి రాయి నుంచి వచ్చే ధ్వని వేర్వేరుగా ఉండటం చూసి అక్కడికి వచ్చేవాళ్లు ఆశ్చర్యపోతారు.

నగారా బండ వెనుక వేల ఏళ్ల చరిత్ర

Advertisement

ఈ వింత రాళ్ల వెనుక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. రాజుల కాలంలో శత్రువుల కదలికలను గమనించినప్పుడు ఈ రాళ్లను కొట్టి పెద్ద శబ్దం చేసేవారట. ఆ ధ్వనితో గ్రామ ప్రజలు, సైనికులు అప్రమత్తమయ్యేవారట. నగారా మోగించినట్లుగా శబ్దం వినిపించడంతో ఈ గుట్టకు  నగారా బండ  అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతం గురించి ఎక్కువ మందికి తెలియకపోయినా, ప్రకృతి ప్రేమికులు, కొత్త ప్రదేశాలను అన్వేషించే వారు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ సంగీత రాళ్లను చూసి అద్భుతంగా ఫీలవుతుంటారు. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం చిన్నా, పెద్దా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, చుట్టూ ఉన్న బండరాళ్లు, సహజసిద్ధమైన అందాలు సందర్శకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.

నగారా బండను రక్షించాలంటున్న స్థానికులు

తెలంగాణలోనే అరుదైన ప్రకృతి సంపదకు సరైన రక్షణ లేకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రాంతంలోని కొంత భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని పరిరక్షించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

ప్రపంచంలో అరుదుగా కనిపించే సంగీత రాళ్లు తెలంగాణలో ఉండటం నిజంగా గర్వకారణం. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే రాళ్లు కూడా రాగాలు పలుకుతాయనే విషయం నమ్మకుండా ఉండలేరు. నల్లగొండకు వెళ్లే అవకాశం వస్తే, నగారా బండను తప్పకుండా సందర్శించి ఈ వింత అనుభూతిని ఆస్వాదించండి. ప్రకృతి, చరిత్ర, సంగీతం కలిసిన అపూర్వమైన ప్రదేశంగా మదిలో చిరస్థాయిగానిలుపుకోండి!

Read Also: నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!

Related News

ఇదేందయ్యా ఇది.. ఇక్కడ కారు నడిపితే, ఆకాశంలో తేలినట్లే.. నెవర్ బిఫోర్ రోడ్డు!

గోల్డెన్ కలర్ పాముల సామ్రాజ్యం.. అందమైన ఆ దీవి మనుషుల పాలిట డెత్ ట్రాప్‌గా ఎలా మారింది?

953 కిటికీలతో పురాతన టెక్నాలజీ రాజభవనం.. శ్రీ కృష్ణుడి మకుటంలాంటి ఆకారం..విదేశీ పర్యటకుల ఫేవరెట్

మౌంట్ ఎవరెస్ట్‌ పై వందల మృతదేహాలు.. వాటిని ఎందుకు తీసుకురారు?

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!

విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×