E-Paper
Advertisement

హీరోలకు థియేటర్లపై ఇంత మోజు ఎందుకో.. అసలు ప్లాన్ ఇదేనా?

హీరోలకు థియేటర్లపై ఇంత మోజు ఎందుకో.. అసలు ప్లాన్ ఇదేనా?
Advertisement

Multiplex Business : ఒకప్పుడు హీరో అంటే సినిమా చేయడం వరకే. ఇప్పుడు మాత్రం సినిమా పూర్తయ్యాక కూడా ఏ బిజినెస్ చేద్దాం, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేద్దాం అన్న మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు స్టార్ హీరోల చూపు థియేటర్ల మీద పడిందా? అన్న అనుమానాలు రైజ్ అవుతున్నాయి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా

Advertisement

ఒక పక్క చూస్తే ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకు, విజయ్ దేవరకొండ నుంచి రవితేజ వరకు అందరూ తమ పేరుతో థియేటర్లు ఏర్పాటు చేయడం తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఇదే బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పేరు ఇలా వినిపించాయో లేదో అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.

సొంత థియేటర్ ఉంటే టెన్షన్ తక్కువ?

Advertisement

“సినిమా రిలీజ్ చేసుకోవడానికి సొంత థియేటర్ ఉంటే టెన్షన్ తక్కువ అనుకున్నారేమో!’అంటూ ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.మరికొందరు అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి,”బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ కాకపోయినా… థియేటర్ బిజినెస్ హిట్ అయితే చాలు అనుకుంటున్నారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

also read :సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

నిజానికి ఇందులో ఆశ్చర్యపడాల్సింది కూడా ఏమీ లేదు. సినిమా మహా అయితే రెండు మూడు వారాల ఆట. కానీ మంచి లొకేషన్‌లో ఉన్న మల్టీప్లెక్స్ మాత్రం సాలిడ్ ఇన్కం తీసుకొస్తుంది.అందుకే స్టార్ హీరోలు కూడా దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి

నిజానికి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ వ్యాపారం గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. ప్రేక్షకులు కూడా మంచి సౌండ్, లగ్జరీ సీటింగ్, ప్రీమియం అనుభవం కోసం అదనంగా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఈ బిజినెస్‌పై దృష్టి పెడుతున్నారు. అది టాలీవుడ్‌కే పరిమితం కాదు.. బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ ప్లాన్స్ గురించి వినిపిస్తున్న వార్తలపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు.సో ఇవన్నీ ప్రస్తుతానికి రూమర్స్ గానే చూడాలి . ఏమో ఈ రోజు రూమర్స్ గా వినిపించినవి ఎన్నో ఫ్యాక్ట్స్ గా మారి కళ్ళ ముందు కనిపించాయి కూడా.చూడాలి RR ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారో !

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×