E-Paper
Advertisement

గుట్టు చప్పుడు కాకుండా లీకైన గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆ 3 వాచ్‌లు ఉన్నవారికి లక్కే!

గుట్టు చప్పుడు కాకుండా లీకైన గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆ 3 వాచ్‌లు ఉన్నవారికి లక్కే!
Advertisement

Wear OS 7 Update: స్మార్ట్‌వాచ్ ప్రియుల కోసం గూగుల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. గత నెలలో జరిగిన ఐఓ 2026 ఈవెంట్‌లో గూగుల్ పరిచయం చేసిన Wear OS 7 అప్‌డేట్ త్వరలోనే రోల్ అవుట్ కానుందని తెలుస్తోంది. ప్రముఖ టెలికాం సంస్థ వెరిజోన్ సపోర్ట్ పేజీల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. మొత్తం మూడు పిక్సెల్ వాచ్ మోడళ్లకు ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లభించనుంది.

లీకైన వివరాలు ఇలా..

వెరిజోన్ తమ సపోర్ట్ పేజీలలో పిక్సెల్ వాచ్ 2, పిక్సెల్ వాచ్ 3, అలాగే పిక్సెల్ వాచ్ 4 మోడళ్లకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసింది. అంతే కాదు.. Wear OS 7 అప్‌డేట్ బిల్డ్ నెంబర్ కూడా లిస్ట్ అయ్యింది. జూన్ రెండో వారంలోనే ఈ అప్‌డేట్ విడుదల కావాల్సి ఉన్నట్లు వెబ్‌సైట్‌లో కనిపించినప్పటికీ.. గూగుల్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వెరిజోన్ ముందస్తుగానే వివరాలను పోస్ట్ చేయడంతో, ఈ అప్‌డేట్ ఏ క్షణమైనా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: Samsung మెగా సేల్ షురూ.. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌, రూ.99కే మూడేళ్ల వారంటీ!

ఆండ్రాయిడ్ 17 డిజైన్..

ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందిన ఈ కొత్త అప్‌డేట్ స్మార్ట్‌వాచ్ లుక్‌ను పూర్తిగా మార్చేయనుంది. ఇందులో సరికొత్త డిజైన్‌తో పాటు ‘వేర్ విడ్జెట్స్’ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాటరీ లైఫ్ పెంచడంపై గూగుల్ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతేకాదు.. గూగుల్ ఏఐ ‘జెమిని ఇంటెలిజెన్స్’ ఆధారంగా పనిచేసే ‘లైవ్ అప్‌డేట్స్’ ఫీచర్ దీని ప్రత్యేకత. దీనివల్ల ఫోన్‌లోని యాప్స్ సమాచారాన్ని వాచ్ స్క్రీన్‌పైనే నేరుగా, రియల్ టైమ్‌లో చూసుకోవచ్చు.

ఫిట్నెస్ ప్రియుల పండగే:

Advertisement

వ్యాయామాలు చేసేవారి కోసం ఇందులో ‘వేర్ వర్కౌట్ ట్రాకర్’ అనే కొత్త ఫీచర్‌ను జత చేశారు. ఇది హార్ట్‌రేట్ మానిటరింగ్, మీడియా కంట్రోల్స్ రెండింటినీ కలిపి మరింత మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఇందులోని రిమోట్ అవుట్‌పుట్ స్విచ్చర్ సాయంతో వాచ్ నుంచే ఆడియో ప్లేబ్యాక్ డివైజ్‌లను సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఫోన్ యాప్స్‌కు సంబంధించిన ఆటోమేటెడ్ టాస్క్‌లను కూడా ఇకపై వాచ్ నుంచే నేరుగా ట్రాక్ చేసుకునే సదుపాయం లభిస్తుంది. పాత వాటితో పోలిస్తే ఈ అప్‌డేట్ వాచ్ పనితీరును మరింత వేగవంతం చేయనుంది.

Also Read: YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×