E-Paper
Advertisement

విశాఖ టు భోగాపురం.. బస్సుకు రూ.300, క్యాబ్‌కు రూ.1,500.. వామ్మో ఇదేం బాదుడురా అయ్యా!

విశాఖ టు భోగాపురం.. బస్సుకు రూ.300, క్యాబ్‌కు రూ.1,500.. వామ్మో ఇదేం బాదుడురా అయ్యా!
Advertisement

Bhogapuram Transport: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఘనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్టు 17 నుంచి ఇక్కడి నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి ప్రయాణించే ప్రయాణికుల రవాణా ఛార్జీల విధానం మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటోంది. ఆర్టీసీ సైతం విశాఖలోని వివిధ ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది.

విశాఖకు ఎంత దూరం?

భోగాపురం విమానాశ్రయం జాతీయ రహదారి-16 పక్కన.. విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది. విశాఖపట్నం నుంచి ఇది సుమారు 43 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్ లోని సీతమ్మధార నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే దాదాపు 75 నిమిషాల సమయం పట్టనుంది. అదే గాజువాకలోని సీఎంఆర్ సెంట్రల్ నుంచి చూస్తే విమానాశ్రయం 60.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి మహానగరాల్లో విమానాశ్రయాలు నగరం వెలుపల ఎంత దూరంలో ఉంటాయో.. ఇది కూడా అంతే దూరంలో ఉండటం గమనార్హం. అయితే విశాఖ శివార్లలోని ఆనందపురం నుంచి మాత్రం ఇది కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉండి అరగంట ప్రయాణంతో చేరుకోవచ్చు.

ఎయిర్ పోర్ట్‌కు ఎలక్ట్రిక్ బస్సులు

Advertisement

భోగాపురానికి వెళ్లే విమాన ప్రయాణికుల కోసం.. అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం కల్పించేందుకు APSRTC కసరత్తు చేస్తోంది. విశాఖలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖ కోర్ సిటీ నుంచి ఈ-బస్సు ఛార్జీని రూ.300గా, అలాగే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురవాడ ప్రాంతం నుంచి రూ.100గా నిర్ణయించే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఛార్జీల పట్టికకు అధికారిక ఆమోదం లభించాల్సి ఉంది. ఇక తొలి విడతలో ఎయిర్ పోర్టుకు 20 ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ప్రతి రూట్‌లో 10 బస్సుల చొప్పున రెండు ప్రధాన మార్గాల్లో ఇవి నడవనున్నాయి.

ఆ ఏరియాలను కలుపుతూ..

తొలి రూట్ లో భాగంగా గాజువాక నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, మధురవాడ, ఆనందపురం మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు ఎలక్ట్రిక్ బస్సులు చేరుకోనున్నాయి. ఈ ప్రయాణ సమయం సుమారు గంటన్నర నుంచి గంటా 45 నిమిషాలు పట్టనుంది. రెండవ రూట్ లో గాజువాక నుంచి సింధియా, విశాఖ రైల్వే స్టేషన్, బీచ్ రోడ్డులోని వీఎంఆర్‌డీఏ పార్క్, ఐటీ హిల్స్ (మధురవాడ), మరీకవలస, ఆనందపురం మీదుగా విమానాశ్రయానికి బస్సులు వెళ్లనున్నాయి. ఈ ప్రయాణానికి దాదాపు 2 గంటల సమయం పట్టనుంది. కాగా ప్రయాణికుల రద్దీని బట్టి భవిష్యత్తులో బస్సుల సంఖ్యను, రూట్లను పెంచుతామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!

ప్రైవేటు క్యాబ్స్‌కు వెళ్తే ఛార్జీల మోతే!

ఆర్టీసీ బస్సు కాకుండా ఓలా, ఉబర్, ర్యాపిడో అందించే క్యాబ్ సేవలను ఎయిర్ పోర్ట్ వరకూ ఉపయోగించుకోవాలంటే భారీగా ఖర్చయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సగటున ఎయిర్ పోర్ట్ కు రూ.1000-1,500 వరకూ ఛార్జీ చెల్లించాల్సి రావొచ్చు. మధురవాడ బెల్ట్ నుంచి క్యాబ్ లో ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.900 వరకు ఛార్జ్ చేయనున్నారు. అదే గాజువాక (సీఎమ్‌ఆర్ సెంట్రల్) నుంచి బయలుదేరితే రూ.1,440 నుంచి రూ.1,500 వరకు క్యాబ్స్ కు చెల్లించాల్సి రావొచ్చు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటికి నిర్ధిష్టమైన ఛార్జీలు అంటూ ఏమి లేవు. రద్దీ సమయాల్లో సాధారణం కంటే 1.4 నుండి 1.6 రెట్లు క్యాబ్ ధరలు పెరగొచ్చు. ఇక వీకెండ్స్, పండుగలు, సెలవు రోజులు, వర్షం పడే సమయాల్లో క్యాబ్ ధరలు 3 రెట్లు పెరిగినా ఆశ్చర్యంపోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. .

Also Read: భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

Tags

Related News

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!

భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

రైళ్లలో భారీ లగేజ్‌లు తీసుకెళ్లేవాళ్లకి షాక్.. కొత్త రూల్స్ ఇవే!

మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

పాస్‌పోర్ట్ రంగుల అసలు రహస్యం తెలుసా? బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ దేనికి సంకేతమంటే..!

విశాఖ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లు!

Big Stories

Advertisement
×