E-Paper
Advertisement

Raja Yoga: రాజయోగం పట్టాలంటే ఈ చిన్న రెమెడీ పాటించాలట – ఇంకా పరిహారశాస్త్రం లో ఏముందంటే

Raja Yoga: రాజయోగం పట్టాలంటే ఈ చిన్న రెమెడీ పాటించాలట – ఇంకా పరిహారశాస్త్రం లో ఏముందంటే
Advertisement

Raja Yoga: జీవితంలో రాజయోగం పట్టాలని చాలా మంది కోరుకుంటారు. ఎన్ని కష్టాలున్నా తీరాలని ఆలోచిస్తుంటారు. ఇంకొందరైతే రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండి ఎంత సేవ చేసినా వారికి ఆశించన పదవులు దక్కవు.. అలాంటి వారి కోసమే పరిహారశాస్త్రంలో అద్బుతమైన సింపుల్‌ రెమెడీస్‌ ఉన్నాయని చెప్తున్నారు.. పరిహారశాస్త్ర నిపుణులు. ఎవరికి వారే సింపుల్‌గా చేసుకునే ఆ పరిహారాలేంటో…? అవి పాటించడం కలిగే ఇతర ముఖ్యమైన ఫలితాలేంటో ఇప్పుడు  ఈ కథనంలో తెలుసుకుందాం.

పసుపు మూట (Yellow wrap):

జీవితంలో ఆర్థికంగా కలిసిరావాలన్నా..? అప్పులు తీరిపోయి ప్రశాంతంగా ఉండాలన్నీ పరిహారశాస్త్రం ప్రకారం ఒక చిన్న పసుపు కలర్‌ క్లాత్‌ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి మూట కట్టి ఆ మూటను ప్రతి రోజు నిద్రించే తలగడ కింద పెట్టుకోవాలట. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ వ్యక్తికి విశేషమైన ధనలాభం కలుగుతుందట. ఇంకా చెప్పాలంటే బికారి కూడా కొద్ది రోజుల్లోనే లక్షాధికారి అయిపోతాడని పండితులు సూచిస్తున్నారు.

ఎర్ర చందనం ముక్క(Red sandalwood):

Advertisement

ఎవరైతే ప్రతి రోజూ ఎర్రచందనం ముక్కను తీసుకుని నిద్రించే ముందు తల కింది కానీ దిండు కింద కానీ పెట్టుకుని పడుకుంటారో ఆ వ్యక్తికి ఉన్న అన్ని రకాల దోషాలు హరించుకు పోతాయట. దీంతో పాటు ఆ వ్యక్తికి ఆర్థికరమైన సమస్యలు తీరిపోయి.. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయట.

సిల్వర్‌ ఫిష్‌ లాకెట్‌:

జీవితంలో ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు.. రాజకీయంగా కలిసి రాని వ్యక్తులు ఫిష్‌ లాకెట్‌ పరిహారం చేసుకుంటే అద్బుతమైన ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు పండితులు. అందుకోసం వెండితో చేప లాకెట్‌ చేయించుకుని రాత్రి పూట నిద్రించే ముందు చేప లాకెట్‌ను తలగడ కింద పెట్టుకుని నిద్రపోవాలట. అలా కంటిన్యూగా ఈ రెమెడీ చేస్తుంటే.. త్వరలోనే ఆ వ్యక్తులకు రాజయోగం పడుతుందట. రాజకీయంగా పదవులు దక్కుతాయట. అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయని పరిహారశాస్త్రంలో ఉందని పండితులు చెప్తున్నారు.

ఐదు రూపాయల కాయిన్‌:

Advertisement

ఎవరైతే తమ కష్టాలు, నష్టాలు తీరిపోయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటారో అటువంటి వ్యక్తులు ఐదు రూపాయల కాయన్‌తో అద్బుతమైన రెమెడీ చేసుకోవచ్చట. బుధవారం రోజు ఒక ఐదు రూపాయల కాయిన్‌ తీసుకుని రాత్రి పూట నిద్రించే సమయంలో ఆ కాయిన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతారో అటువంటి వారు త్వరలోనే కష్టాలు తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందట. అయితే ప్రతిరోజు తలకింద పెట్టుకున్న ఆ కాయిన్‌ను మరుసటి రోజు ఎవరైనా పేదవారికి ఇవ్వాలట. ఇలా ఈ రెమెడీని కంటిన్యూగా 45 రోజులు చేస్తే ఫలితాలు బాగా వస్తాయట. ఇలా చేసిన వ్యక్తులు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సింహ రాశికి ఈ సంవత్సరం లైఫ్‌ టర్నింగ్‌ అవ్వడం పక్కా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×