E-Paper
Advertisement

Ugadi panchangam 2026: సింహ రాశికి ఈ సంవత్సరం లైఫ్‌ టర్నింగ్‌ అవ్వడం పక్కా

Ugadi panchangam 2026: సింహ రాశికి ఈ సంవత్సరం లైఫ్‌ టర్నింగ్‌ అవ్వడం పక్కా
Advertisement

Ugadi panchangam 2026: ఈ ఉగాది  నుంచి ప్రారంభం కానున్న నూతన తెలుగు సంవత్సరం శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి వారికి గురు, శని ప్రభావంతో జీవితంలో  టర్నింగ్ పాయింట్ రానుందట.  కెరీర్‌లో సవాళ్లు ఎదురైనా, మే 17 – అక్టోబర్ 9 మధ్య లైఫ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అయ్యే సంఘటనలు జరుగుతాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు  స్థిరమైన ప్రగతి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుండటం వల్ల చాలా కష్టాలు ఉండాలి. కానీ ప్రథమార్థంలో గురుబలం ఉండటం చేత కొంత ఉపశమనం ఉంటుంది. ఈ రాశిలోకి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. వాటిలో మఖ నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు.. మూ, మే, మో, టా అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు.. ఇక పుబ్బ నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు టా, టీ, టూ, టే అక్షరాలతో పేర్తు మొదలయ్యేవారు.. ఇక ఉత్తర పల్గుణి నక్షత్రం ఒకటవ పాదం ఈ రాశిలోకి వస్తాయి. ఈ రాశికి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 గా ఉన్నాయి.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ రాశి వారికి ఈ సంవత్సరం విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. రాజకీయ నాయకులకు అంతగా కలిసి రాదు.. ఈ రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకోకుండా ట్రాన్స్‌ఫర్లు వస్తాయి. అయితే ఈ రాశి వారు ఈ సంవత్సరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడద. దీని వల్ల లేనిపోని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అయితే మార్పుల కోసం ప్రయత్నించవద్దు.. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలు.

ఆర్థిక పరిస్థితి:

ఈ సంవత్సరం పథమార్థంలో ఈ రాశి వారికి గురుబలం ఉండటం చేత అద్బుతమైన ఆదాయం వస్తుంది.  అయితే ద్వితీయార్థంలో మాత్రం ఘోరమైన ఖర్చులు ఉంటాయి. ప్రథమార్థంలో సంపాదించిందంతా ద్వితీయార్థంలో ఖర్చు అయ్యే పరిస్థితులు వస్తాయి. ఇంకా అప్పులు చేయాల్సి రావొచ్చు. కాబట్టి మొదటి నుంచి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యం:

Advertisement

ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల అసలు అశ్రద్ద చేయకూడదట. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే డ్రైవింగ్‌ చేసేటప్పుడు.. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

కుటుంబం:

ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో చిన్నపాటి గొడవలు జరిగినా అవి చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం ఉందట. అందుకే ఎలాంటి గొడవలు జరగకుండా సంయమనం పాటించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. అయితే మీ కష్టకాలంలో స్నేహితులు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయి.

పరిహారాలు:

ఈ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం మంచి జరగడానికి శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయించాలట. అలాగే ప్రతిరోజూ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయాలట. ఇంకా ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయాలని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఊహించని అభివృద్ది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×