E-Paper
Advertisement

రాశి ఫలితాలు ఏఫ్రిల్ 1: ఆ రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు

రాశి ఫలితాలు ఏఫ్రిల్ 1: ఆ రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 1వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.  విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. 

వృషభం

Advertisement

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. 

మిథునం

పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం

ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

కన్య

సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

వృశ్చికం

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

ధనుస్సు

సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.  

మకరం

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. 

కుంభం

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

మీనం

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తవహించాలి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×