E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 24: ఆ రాశి వ్యాపారులకు అనుకోని లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 24: ఆ రాశి వ్యాపారులకు అనుకోని లాభాలు

Today Horoscope: 

Advertisement

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి. 

మిథునం

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయమై సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

కర్కాటకం

Advertisement

గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

సింహం

స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

వృశ్చికం

గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

ధనుస్సు

నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి.  

మకరం

దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. 

కుంభం

చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు.  దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Big Stories

×