E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 5: ఆ రాశి వారికి ఊహించని సమస్యలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 5: ఆ రాశి వారికి ఊహించని సమస్యలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. 

వృషభం

Advertisement

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. 

మిథునం

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. 

కర్కాటకం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బందిపడతారు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. 

కన్య

భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.

వృశ్చికం

సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ధనుస్సు

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.  

మకరం

వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. 

కుంభం

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.

మీనం

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×