E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు – వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు – వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వృషభం

Advertisement

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. 

మిథునం

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

కర్కాటకం

Advertisement

వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది.కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి.  సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. 

కన్య

కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. రుణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం

మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి.  చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. 

ధనుస్సు

వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.

మకరం

వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ప్రేమికులకు అనువైన రోజు

కుంభం

వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

మీనం

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.  కొన్ని వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×