E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ట్రాన్స్ పర్లు – వారికి ఆర్థిక ఇబ్బందులు

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ట్రాన్స్ పర్లు – వారికి ఆర్థిక ఇబ్బందులు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్న పాటి వివాదాలు తప్పవు.  శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. 

వృషభం

Advertisement

వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి.  ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. 

మిథునం

చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

కర్కాటకం

Advertisement

వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కన్య

ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

 సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. 

ధనుస్సు

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు.  ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మకరం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

కుంభం

ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీనం

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×