E-Paper
Advertisement

Monthly Horoscope in Telugu: ‘డిసెంబర్ రాశిఫలాలు’ : ఈనెలలో ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వారికి నూతన వాహన యోగం

Monthly Horoscope in Telugu: ‘డిసెంబర్ రాశిఫలాలు’ :  ఈనెలలో ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వారికి నూతన వాహన యోగం
Advertisement

Monthly Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ నెల రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఈ నెల ఈ రాశి వారు  చేపట్టిన పనులు పూర్తి కావు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసం చివరన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సుబ్రహ్మణ్యష్టాకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

వృషభ రాశి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి  వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు అమలు పరచలేరు. బాగోద్వేగాలను అదుపులో ఉంచడం మంచిది.  ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నలు మందగిస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. మాసంతమున చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణాలు తీర్చాగలుగుతారు. రాజరాజేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

మిథున రాశి:  

ఈ నెలలో ఈ రాశి వారికి  అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మాసం చివరన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.  

కర్కాటక రాశి:

Advertisement

ఈ నెలలో  ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకర్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్య విషయాలలో శుభ వార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం పడతారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.  

సింహరాశి:

ఈ నెలలో ఈ రాశి వారు ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకి సాగుతారు. శత్రువులపై పై చెయ్యి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభ సాటిగా సాగుతాయి.   మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

కన్యారాశి :

ఈ నెలలో ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు త్వరితగతినా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో వివాహాది శుభ కార్యాలకు హాజరు అవుతారు. ఉద్యోగమున మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణ పనులు కార్యరూపం దాలుస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.  

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఈ నెలలో ఈ రాశివారికి కీలక వ్యవహారాలలో కుటుంభ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సంతాన ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సహన్నిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. మాసం మధ్యలో దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో తొందరపాటు వలన కార్యటంకములు తప్పవు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మాసం చివరన ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

ధనస్సు రాశి:

ఈ నెలలో ఈ రాశివారికి  ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సంతానంతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగస్థులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మాసం చివరన శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి నుండి బయట పడతారు. గురు చరిత్ర పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

మకరరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి  ఆరోగ్య సమస్యలు మరింత భాదిస్తాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు. సంతాన పరమైన సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నతరహా పరిశ్రమలకు ఆశించిన ఫలితాలు ఉండవు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.   హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.    

కుంభరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కళాత్రముతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాలలో వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.  వృధా ఖర్చులు పెరుగుతాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

మీనరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి  శత్రు పరమైన సమస్యలపై విజయం సాధిస్తారు. స్త్రీ సంభంధిత ధన లాభాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్థులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.  

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×