E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Advertisement

Road Accident : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలు అయునట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. చామనపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై నగునూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా మరో బైక్‌పై వస్తున్న దంపతులతో అతని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు నుజ్జునుజ్జు అయ్యాయి. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.

Advertisement

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాద సమయంలో ఇద్దరూ హెల్మెట్ ధరించారా లేదా అన్న కోణంలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. వేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వేగ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. మోసానికి మూల్యం చెల్లించుకున్నావ్ అంటూ క్యాప్షన్..

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×