E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రాజకీయ నాయకుల నుంచి పిలుపు వస్తుంది

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రాజకీయ నాయకుల నుంచి పిలుపు వస్తుంది
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది. 

వృషభం

Advertisement

ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారపరంగా భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

మిథునం

చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.

సింహం

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

కన్య

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికం

పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు. 

ధనుస్సు

అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు.  

మకరం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

కుంభం

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

మీనం

 నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.  సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×