E-Paper
Advertisement

Black Comedy Movie OTT : 1750 కోట్ల సినిమా… స్క్రిప్ట్ పూర్తి కావడానికే 20 ఏళ్లు… ఇండియన్ ఓటీటీలో చూడాలంటే మాత్రం చిన్న ట్విస్ట్

Black Comedy Movie OTT : 1750 కోట్ల సినిమా… స్క్రిప్ట్ పూర్తి కావడానికే 20 ఏళ్లు… ఇండియన్ ఓటీటీలో చూడాలంటే మాత్రం చిన్న ట్విస్ట్
Advertisement

Black Comedy Movie OTT : ఓటీటీలలో ఉన్న కొన్ని బెస్ట్ సినిమాలను ఎన్నిసార్లు చూసినా తనివే తీరదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ నోట హాట్ టాపిక్ అయ్యే అలాంటి సినిమాలను అస్సలు మిస్ అవ్వొద్దు. అందుకే ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మూవీనే. కానీ ఈ మూవీ స్టోరీ డెవలప్ అవ్వడానికి ఏకంగా 20 సంవత్సరాలు పట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ 2 గంటల 41 నిమిషాల సినిమా విజయం గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకున్నారు, విన్నారు. కానీ దాని వెనకున్న కష్టం గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. మరి ఈ అవార్డు విన్నింగ్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్

బాక్సాఫీస్ దగ్గర 1750 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్లలో కూడా రికార్డు సృష్టించి , ఒక మంచి సినిమా పవర్ ఏంటో ప్రూవ్ చేసింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 13 ఆస్కార్ నామినేషన్లను అందుకోవడం గమనించదగ్గ విషయం. ఇంతటి ఘనత సాధించిన ఆ మూవీ పేరు మరేమిటో కాదు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (one battle after another). ఇందులో బెనిసియో డెల్ టోరో, రెజీనా హాల్, టెయానా టేలర్ వంటి ప్రఖ్యాత నటులు నటించారు. ఈ చిత్రంలో యాక్షన్, థ్రిల్లర్, బ్లాక్ కామెడీని మిళితం చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు మేకర్స్. భారతదేశంలో ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. కానీ ఈ మూవీ విషయంలో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీని ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్స్క్రయిబర్లు కూడా ఫ్రీగా చూడలేరు. ఈ ఎపిక్ మూవీని చూడాలంటే అద్దెగా 499 సమర్పించుకోవాల్సిందే.

Advertisement

Also Read : కంటి మీద కునుకు లేకుండా చేసే టాప్ 5 మర్డర్ మిస్టరీస్… ఒక్కో సినిమాలో మైండ్ బెండయ్యే ట్విస్టులు

సినిమా వెనుక ఇంత కథ !

ఈ చిత్ర దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఒక ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. దీని కథను రాయడానికి ఏకంగా 20 సంవత్సరాలు పట్టిందని ఆయన స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఇది అతని అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటని చెప్పుకొచ్చారు. ఇక కథ విషయానికొస్తే… ఈ సినిమా కథ బాబ్ (లియోనార్డో డికాప్రియో) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన కుమార్తె విల్లా (చేజ్ ఇన్ఫినిటీ)కు దూరంగా జీవిస్తాడు. అయితే 16 సంవత్సరాల తరువాత బాబ్ పాత శత్రువు తిరిగి రావడంతో అతని జీవితం అల్లకల్లోలం అవుతుంది. ప్రాణంగా ప్రేమించిన తన కుమార్తె మిస్ అవుతుంది. మరి ఇంతకీ బాబ్ గతం ఏంటి? ఆ శత్రువులు ఎవరు ? అతని కూతురు ఎలా మిస్ అయ్యింది ? క్లైమాక్స్ ఏంటి? 11 ఆస్కార్ నామినేషన్లు వరించే అంతగా ఈ మూవీలో ఏముంది ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×