E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో అంతరాయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో అంతరాయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు.  శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. 

వృషభం

Advertisement

వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి. 

మిథునం

కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంభందించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం

Advertisement

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకొన్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సింహం

చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు. 

కన్య

కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక ఋణ సమస్యలు తీరి ఊరట పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. నూతన ఋణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. 

ధనుస్సు

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.  

మకరం

బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.  వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది  

కుంభం

ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం

స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగంలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×