E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వ్యాపారులకు లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 15వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. 

వృషభం

Advertisement

 జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. 

మిథునం

ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

కర్కాటకం

Advertisement

వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం

బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. 

కన్య

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధిక ఫలితం తక్కువగా ఉంటుంది.

వృశ్చికం

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

ధనుస్సు

 సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.  

మకరం

ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. 

కుంభం

ఆకస్మిక ధన లాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×