E-Paper
Advertisement

Gadwal Municipality: గద్వాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. పాగా వేసేందుకు కాంగ్రెస్ గురి..!

Gadwal Municipality: గద్వాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. పాగా వేసేందుకు కాంగ్రెస్ గురి..!
Advertisement

Gadwal Municipality: స్వేఛ్చ బ్యూరో: గద్వాల మున్సిపల్ చైర్మన్ విషయంలో పీటముడి పడింది. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగు పరిస్థితి ఏర్పడింది. దీంతో చైర్మన్ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటారని దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గద్వాల కాంగ్రెస్ లో వర్గ పోరు కారణంగా బీఫాంల కేటాయింపు విషయంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వర్గానికే దక్కించుకున్నారు. దీంతో సరిత వర్గానికి 7 టికెట్లు ఖరారు అయినట్లే అయి బీఫాంల అందజేతలో ఆలస్యం కారణంగా ఆమె వర్గానికి టికెట్లు ఖరారు కాలేదు. కేవలం ఒక టికెట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గద్వాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముందు నుంచి ఆసక్తి రేపాయి. అందరూ ఊహించినట్లుగానే రెండు పార్టీలకు సీట్ల విషయంలో హోరాహోరీ పోటీ ఏర్పడింది. ఎమ్మెల్యే వాడవాడ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.గద్వాల కోటలో పాగా వేసేందుకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. బిఆర్ఎస్ బిజెపి సభ్యులు సైతం క్యాంపు రాజకీయాల్లో నిర్వహిస్తూ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదు పుతున్నారు.

వడ్డేపల్లి హస్తం గూటికి

వడ్డేపల్లిలో సైతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలుపొందిన 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వడ్డేపల్లి శ్రీనివాస్ తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వినతిని ఆ పార్టీ నాయకులతో చర్చించి వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్నికల్లో గెలిచిన 8 మందితో కలిసి పార్టీలో చేరారు. కాగా జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో ఏఐఎఫ్ బి నుంచి గెలిచినట్లు వార్తలు రాగా వడ్డేపల్లి శ్రీనివాస్ ఖండించారు. ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదని మాకు ఎవరు ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదని స్థానికంగా నెలకొన్న సమస్యలను నా రాజకీయ అనుభవంతో పరిష్కరిస్తాననే నమ్మకంతో ఓటర్లు పది స్థానాలకు 8 స్థానాలు కట్టబెట్టారన్నారు.

Advertisement

Also Read: Mahashivratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం.. కొత్తగా చేసేవారు చేయకూడని పొరపాట్లు ఇవే

జోరుగా క్యాంప్ రాజకీయాలు

గద్వాల పుర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నాయకులు వార్డులలో గెలిచిన అభ్యర్థులతో కలిసి క్యాంపు రాజకీయాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాలలోని 37 వార్డులకు గాను 16 వార్డులలో గెలిచిన అభ్యర్థులతో పాటు కాంగ్రెస్కు మద్దతు తెలిపిన ఇద్దరు ఇండిపెండెంట్ లు, ఒకరు ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిన వారితో కర్ణాటకలోని హంపి సమీపంలో ని రిసార్ట్ లో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతో పాటు మద్దతు తెలుపుతున్న ముగ్గురిని మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సమావేశపరిచారు.అదేవిధంగా బిఆర్ఎస్ నుంచి గెలిచిన11 మందితో పాటు బిజెపి నుంచి గెలిచిన ఏడుగురు సైతం క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ ఎక్స్ అఫీషియల్ ఓట్లతో పుర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక మునిసిపాలిటీలో ఓటరుగా నమోదు లేకపోవడంతో ఆ పార్టీల నాయకులు న్యాయపరమైన చిక్కులపై చర్చల్లో మునిగిపోయారు.

బిఆర్ఎస్ ఖాతాలో ఐజ, అలంపూర్

Advertisement

ఐజ, అలంపూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఐజ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ లాంఛనంగా మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చొనున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు 13 వార్డులు గెలిచింది. అలంపూర్ లో సైతం 10 వార్డులకు గాను కాంగ్రెస్ ,బిఆర్ఎస్ తలో ఐదు సీట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో ఏక్స్ అఫీషియో మెంబర్ ఓటు కీలకం కావడంతో స్థానికంగా ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అలంపూర్ మున్సిపాలిటీని బిఆర్ఎస్ ఖాతాలో పడనుంది.

Also Read: Citizen Grievance: మీ సమస్య ఏదైనా.. నేరుగా కమిషనర్‌కే.. CMCలో ‘ప్రజావాణి’ వేదిక

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×