E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అనారోగ్యం – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అనారోగ్యం – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

సన్నిహితులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. 

వృషభం

బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంభందమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. 

మిథునం

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

కర్కాటకం

ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు,మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహం

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. 

కన్య

అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్ధిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తివ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

ధనుస్సు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  

మకరం

ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 

కుంభం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

మీనం

వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×