E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. 

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. 

మిథునం

వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. 

కర్కాటకం

Advertisement

కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

సింహం

విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. 

కన్య

ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు.

వృశ్చికం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. 

ధనుస్సు

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు.  

మకరం

కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి. 

కుంభం

నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది.  వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

మీనం

వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×