E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారులకు ఊహించని లాభాలు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారులకు ఊహించని లాభాలు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. 

వృషభం

Advertisement

దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

మిథునం

నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం

Advertisement

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహం

ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. 

కన్య

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.  సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. 

ధనుస్సు

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.  

మకరం

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.  జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.  

కుంభం

ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×