E-Paper
Advertisement

Thriller movies on OTT: ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు… అద్భుతమైన లేడి ఓరియెంటెడ్ సినిమాలు

Thriller movies on OTT: ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు… అద్భుతమైన లేడి ఓరియెంటెడ్ సినిమాలు
Advertisement

Thriller movies on OTTఇన్వెస్టిగేషన్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు, ఫిమేల్ లీడ్ థ్రిల్లర్ మూవీలు ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇవి మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్స్ తో వస్తున్న ఈ సినిమాలను చూసేందుకు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇలాంటి థ్రిల్లర్ స్టోరీలపై ఓ లుక్ వేద్దాం పదండి.

మర్దానీ 3 (Mardaani 3)

రాణి ముఖర్జీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్‌గా చైల్డ్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియాపై పోరాటం చేస్తుంది. 90 మంది యువతుల మిస్సింగ్ కేసును పోలీసు అధికారిణి శివాని శివాజీ రాయ్ ఎలా దర్యాప్తు చేసిందనేది ఈ చిత్ర కథాంశం. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2019 నాటి మర్దానీ 2కి సీక్వెల్. ఈ సినిమా Netflixలో 2026 మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది.

హక్ (Haq)

Advertisement

యామీ గౌతమ్ ధర్, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ లీగల్ డ్రామా 1985 నాటి సంచలనం సృష్టించిన షా బానో కేసు ఆధారంగా రూపొందింది. విడాకుల తర్వాత భరణం కోసం ఒక ముస్లిం మహిళ చేసిన న్యాయ పోరాటమే ఈ సినిమా స్టోరీ. ఇది ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

దో పట్టి (Do Patti)

కాజోల్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. కృతి సనన్ ద్విపాత్రాభినయం చేయగా, కాజోల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కూడా Netflixలో అందుబాటులో ఉంది.

రాజీ (Raazi)

Advertisement

ఆలియా భట్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక కాశ్మీరీ యువతి గూఢచారినిగా పాకిస్థాన్‌కు వెళ్లి చేసిన సాహసాలు దేశభక్తిని తట్టిలేపుతాయి. దీన్ని Amazon Prime Videoలో చూడవచ్చు.

ఉలజ్ (Ulajh)

జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఒక యంగ్ డిప్లొమాట్ చుట్టూ తిరుగుతుంది. అంతర్జాతీయ కుట్రలో చిక్కుకున్న ఆమె తన నిజాయితీని ఎలా నిరూపించుకుందనేది ఈ కథ. ఈ సినిమా కూడా Netflixలో అందుబాటులో ఉంది. పై సినిమాలన్నీ మహిళలు కథానాయిక పాత్రలు పోషించి మెప్పించినవే.

Read Also : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×