E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి స్థిరాస్థి వివాదాలు – ఉద్యోగులకు గడ్డు కాలం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి స్థిరాస్థి వివాదాలు – ఉద్యోగులకు గడ్డు కాలం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున  ఊహించని  మార్పులు ఉంటాయి.

వృషభం

Advertisement

వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా  వ్యవహరిస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి. 

మిథునం

గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  అనుకూలిస్తుంది. అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

Advertisement

వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. 

కన్య

వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.  ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు  ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప  ఫలితం కనిపించదు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

వృశ్చికం

మిత్రులతో విందు  వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.  కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

ధనుస్సు

అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. 

మకరం

దీర్ఘ కాలిక ఋణ సమస్యలు  నుండి బయట పడతారు. కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.  

కుంభం

 పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో  దూర ప్రయాణాలు చేస్తారు.

మీనం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×